వాట్సాప్ న్యూ ఫీచ‌ర్..సీక్రెట్‌గా ఇతరుల వాట్సాప్ స్టేటస్ చూడాలనుకుంటున్నారా…? ఇలా చెయ్యండి

ఇప్పుడు ప్రపంచం అంతా వాట్సాప్ చుట్టూనే తిరుగుతూ ఉంది. ఫ్యామిలీ గ్రూప్స్, స్కూల్ ఫ్రెండ్స్ గ్రూఫ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ గ్రూఫ్స్, కజిన్స్ గ్రూప్స్, బిజినెస్ గ్రూప్స్, ఆర్గనైజేషన్ గ్రూప్స్ ఇలా ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్ లేకపోతే ఏ పని అవ్వడం లేదు. ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ లేని స్మార్ట్ ఫోన్ ఉండదని విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంట్లో తమ మనుసులోని విషయాలను స్టేటస్ ద్వారా ఇతరులతో పంచుకోవచ్చు. చాలామంది వినియోగదారులుకు రోజూ స్టేటస్ అప్‌డేట్ చేయడం అలవాటుగా మారింది. అయితే కొంతమంది అదే పనిగా పెడుతూ..దాన్ని రైలు పెట్టెల మాదిరి మారుస్తూ ఉంటారు. వాట్సప్‌లో స్టేటస్ అప్‌డేట్ చేస్తే 24 గంటలపాటు యాక్టీవ్‌గా ఉంటుంది. అంటే ఆ స్టేటస్ 24 గంటల పాటు ప్రైవసీని బట్టి మన కాంటాక్ట్ లో ఉన్నవాళ్లకు లేదా మన కాంటాక్ట్ ఉన్నవాళ్లకి కనిపిస్తుంది. ఆ తర్వాత ఆటోమెటిక్‌గా డిలిట్ అవుతుంది. స్టేటస్ అప్‌డేట్ చేయనివారు కూడా ఇతరులు పెట్టే అప్ డేట్స్ పరిశీలిస్తూ ఉంటారు.

అయితే మనం వాట్సప్‌ స్టేటస్ పెడితే ఎవరెవరు చూశారో ఇట్టే తెలిసిపోతంది. వాట్సప్ మెసేజ్ చదివినప్పుడు బ్లూటిక్స్ వచ్చినట్టే, వాట్సప్ స్టేటస్‌లో ఎంతమంది చూశారు..ఎవరెవరు చూశారు అనే విషయాలు తెలిసిపోతాయి. అయితే అవతలివారికి తెలియకుండా స్టేటస్ ఎలా చూడాలి? అనేది చాలా క్యూరియస్ థింగ్. అయితే అది చాలా ఈజీ అని అందరికీ తెలీదు. ఇందుకోసం మీరు ఎలాంటి థర్డ్ పార్టీ యాప్ డౌన్‌లోడ్ చేయాల్సిన పని కూడా లేదు. ఒక చిన్న ట్రిక్ ఫాలో అయితే చాలు. కేవలం మీరు వాట్సప్‌ యాప్‌లో కొన్ని సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది. ఆ సెట్టింగ్స్ మార్చిన తర్వాత మీరు ఎవరి స్టేటస్ చూసినా ఆ విషయం..అవతలివారికి తెలీదు.

వాట్సప్‌లో Read Receipts (రీడ్ రిసిప్ట్స్) అనే ఆఫ్షన్ ఉంటుంది. రీడ్ రిసిప్ట్స్ ఫీచర్ ఛాట్స్ కోసం వినియోగిస్తాం కదా… మీకు వచ్చిన వాట్సప్ మెసేజ్‌ మీరు చదవగానే అవతలివారికి బ్లూటిక్స్ కనిపిస్తాయి. ఇలా కనపడకుంగా ఉండాలంటే Read Receipts ఆఫ్ చేయాలని చాలామందికి తెలుసు. వాట్సప్ స్టేటస్‌కు కూడా రీడ్ రిసిప్ట్స్ ఫీచర్ ఇలాగే వర్క్ అవుతుంది. మీరు వాట్సప్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అందులో అకౌంట్స్ సెలక్షన్ చేయాలి. ఆ తర్వాత ప్రైవసీ ఓపెన్ చేస్తే Read Receipts ఉంటుంది. దాన్ని ఆఫ్ చేసినట్లైతే.. మీరు ఎవరి స్టేటస్ అయినా చూసినా మీరు స్టేటస్ చూసినట్టు కనిపించదు. అయితే ఇందులో చిన్న తికమక విషయం ఏంటంటే… రీడ్ రిసిప్ట్స్ ఆఫ్ చేస్తే.. మీరు అప్‌డేట్ చేసిన స్టేటస్ అవతలివారు చూశారో లేదో కూడా కనిపించదు. అలా ఫిక్స్ అయితే ఈ ఫీచర్ ఎంచక్కా ఆఫ్ చేయొచ్చు.