పుట్టింటికి వెళ్ళిన భార్య తిరిగిరాలేదని వాట్సప్ స్టేటస్ పెట్టీ మరీ ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి?

ప్రస్తుత కాలంలో వ్యక్తిగత సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల రాజమహేంద్రవరంలో కూడా ఇటువంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా రాజశేఖర్ అనే వ్యక్తి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వాట్సాప్ లో స్టేటస్ పెట్టి కనిపించకుండా పోయాడు. ఈ ఘటన రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే… రాజశేఖర్ అనే వ్యక్తి తన తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకొని ధవలేశ్వరం ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. స్థానికంగా శ్రీగౌతమీ ఎంటర్‌ప్రైజస్‌ పేరుతో వ్యాపారం కూడా ప్రారంబించి జీవనం సాగిస్తున్నారు. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనఃస్పర్థలు రావడంతో అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. నెలలు గడుస్తున్నా కూడా రాజశేఖర్ భార్య తిరిగి రాకపోవడంతో రాజశేఖర్ మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. దీంతో అతని తండ్రి అంబటి సింహాచలం ఈ నెల 17న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడి ద్విచక్ర వాహనం రైలు వంతెనపై పడి ఉందని, రాజశేఖర్ గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీంతో పోలీసులు రాజశేఖర్ గోదావరిలో దొరికి ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎక్కడైనా తప్పిపోయాడా? అన్న విషయాల గురించి ఎంక్వయిరీ మొదలుపెట్టారు. ఒకవేళ గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటే వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుండటం వల్ల మృతదేహం లభించే అవకాశం లేదని పోలీసులు వివరించారు.