రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ప్రపంచ దేశాలు గుర్రుగా ఉన్నాయి. తాజాగా ఆస్ట్రేలియా సంచలన ప్రకటన చేసింది. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌పై ఆర్థిక, ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తెలిపారు. వ్లాదిమిర్ పుతిన్‌ను ఉక్రెయిన్‌పై చేసిన దాడిని ఖండిస్తున్నాం. ఆర్థిక ఆంక్షలు, ప్రయాణ నిషేధాలు రష్యా అధ్యక్షుడితో పాటు రష్యా భద్రతా మండలిలోని శాశ్వత సభ్యులపై రాత్రి నుండి అమలులోకి వస్తాయని’’ అని మోరిసన్ చెప్పారు. ప్రపంచ దేశాలు ఉక్రెయిన్‌కు బాసటగా నిలుస్తు్న్నాయి. నాటో ట్రస్ట్ ఫండ్.. సైనిక పరికరాలు, వైద్య సామాగ్రి, 3 మిలియన్ డాలర్ల విరాళాన్ని ఉక్రెయిన్‌కు అందించాయి.