బర్గర్ తినడానికి రెండున్న‌ర ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి హెలికాప్టర్‌లో వెళ్ళిన ఆ మ‌హానుభావుడెవ‌రో తెలుసా?

ప్రపంచంలో ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే..ఆకలి..నేను కాదు ఈ విషయాన్ని ప్రస్థానం సినిమాలో సాయి కుమార్ గారు చెప్పారు. అది నూటికి నూరు శాతం నిజం కూడా. పర్సు కాళీగా, ఆకలితో కష్టాలు పడ్డ వ్యక్తి ప్రపంచాన్ని ఏలతాడని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే అన్నాన్ని పరబ్రహ్మం స్వరూపంగా భావిస్తారు. తినేటప్పడు కళ్లకు అద్దుకుంటూ ఉంటారు. మరికొందరు రూ.5 భోజనంతో సర్దుకుపోతూ ఉంటారు. దగ్గర్లో ఏదైనా హెటల్ ఉంటే ప్రయాణ ఖర్చులు ఆదా చెయ్యడానికి కాలినడకనే ఎంచుకుంటారు. ఇలా చేసేది పేద వర్గాలు, మధ్యతరగతి ప్రజలు. ఇంకో బ్యాచ్ ఉంటుంది. వాళ్లు తమ ప్రైవేట్ పంక్షన్లలో వేస్ట్ చేసే ఫుడ్‌తో కొన్ని పేద కుటుంబాలు ఏడాదంతా బ్రతుకుతాయి.

మరీ డబ్బు బలుపు ఎక్కువయితే.. చిన్న బర్గర్ తినేందుకు కూడా హెలికాప్టర్‌లో వెళ్తారు. ఔను ఇప్పుడు చెప్పిన విషయం నిజంగానే జరిగింది.. రష్యాకు చెందిన ఓ మిలీనియర్ మెక్‌డోనల్డ్స్ బర్గర్, ఫ్రైలు తినేందుకు ఏకంగా హెలికాప్టర్‌లో ప్రయాణించాడు. అందుకోసం ఏకంగా రూ.2.39 లక్షలు ఖర్చు పెట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. విక్టర్ మార్టినోవ్ అనే 33 ఏళ్ల బిజినెస్‌మేన్.. క్రిమియాలోని అలుష్తాలో తన ప్రియురాలితో కలిసి హాలీడేస్ ట్రిప్ ఎంజాయ్ చేసేందుకు వెళ్లాడు. అయితే, వారికి మెక్‌డోనల్డ్స్ మీల్ తినాలనే ఆశ కలిగింది. అయితే, ఆ ప్రాంతాల్లో మెక్‌డోనల్డ్స్ ఫుడ్ సెంటర్స్ ఏవీ లేకపోవడంతో డిసప్పాయింట్ అయ్యారు. పక్కనే గర్ల్‌‌ఫ్రెండ్ ఉంది. తనకు ఆకలిగా ఉంది..మెక్‌డోనల్డ్స్ మీల్ అడిగితే తినిపించకపోతే..తన పరువుకే భంగం అని భావించాడు. వెంటనే తన మెదడుకు పదును పెట్టాడు. ఓ క్రేజీ ఐడియా వచ్చింది.

వెంటనే ఓ హెలికాప్టర్‌ను రెంట్‌కు తీసుకున్నాడు. రూ.2.39 లక్షలు పే చేసి.. ఎక్కడో 720 మైళ్ల దూరంలో ఉన్న క్రస్నోడర్‌కు వెళ్లి తనకు కావాల్సిన బిగ్ మ్యాక్స్, ఫ్రైస్, మిల్క్ షేక్‌లు కొనుగోలు చేశాడు. వాటిని పట్టుకుని మళ్లీ హాలీడే విడిదికి తీసుకెళ్లి తన గర్ల్‌ఫ్రెండ్ తో కలిసి ఎంచక్కా ఆరగించాడు. ఆమె ఫుల్ హ్యపీ…మనోది దిల్ కుశ్. అది సంగతి..డబ్బున్నవాళ్లు తల్చుకుంటూ కొండమీద కోతి అయినా దిగి వస్తుందని ఊరికే అంటారా చెప్పండి.