భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం…ఇక్కడే ఎన్నో మతాలు, మరెన్నే సంప్రదాయాలు. మన దేశం లాంటి కంట్రీ బహుశా ప్రపంచంలో ఎక్కడా ఉండదేమో. ఇక ఒక్కో ప్రాంతం ఒక్కో విభిన్నమైన సాంప్రదాయం ఉంంటుంది. ఇప్పడు మీకు ఓ ప్రత్యేక దేవాలయం అక్కడగల విశిష్టతను వివరించోతున్నాం. ఓ టెంపుల్ లో ఎలుకలు తినగా మిగిలిన ఆహారాన్ని భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ వింత ఆచారం..ఇప్పట్నుంచి కాదు..రాజస్థాన్ లో తరతరాలుగా పాటిస్తున్నారు. అవునండీ నిజం…ఎలుకలు తాగగా మిగిలిని పాలను ఇక్కడికి భక్తులు మహా ప్రసాదంలా సేవిస్తారు. అలా చేస్తే..అన్ని కోర్కెలు తప్పక తీరి..జీవితంలో అద్బుతాలు జరుగుతాయని వారి విశ్వాసం.
ఇక్కడ ఉండే కర్ని మాత దర్శనం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. తొలుత కోర్కెలు తీరాలంటూ ముడుపులు కడతారు. ఆపై వాటిని చెల్లించుకునేందుకు అమ్మవారి సన్నిధికి విచ్చేస్తారు. ఈ ఆలయంలో నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది. ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే..ఈ దేవాలయంలో ఉన్న ఎలుకల సంఖ్య 25 వేలకు పైమాటే. అవి భక్తులపై ఎక్కుతూ అటు, ఇటూ తిరుగుతూ ఉంటాయి. అయితే నల్ల ఎలుకలతో పాటు తెల్ల ఎలుకలు ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తాయి. గుడి ఆవరణలో తెల్ల ఎలుకలు కనిపిస్తే..శుభంగా భావిస్తారు భక్తులు. వేల మంది భక్తులు ఇక్కడ తిరగుతూ ఉండగా, ఎలుకలూ ఎవర్నీ కొరకడం గానీ, బాధ పెట్టడం కానీ చెయ్యవు.
సాక్షాత్తూ దుర్గా మాతనే ఇక్కడ శ్రీ కర్నిజీ మహరాజ్ గా అవతరించారని వేద పండితులు చెబుతున్నారు. 15వ శతాబ్దంలో 150 ఏళ్లపాటు ఆమె ఇక్కడ నివశించినట్టు పురాణ కథలు చెబుతున్నాయయి. జోధ్ పూర్, బికనీర్ కు చెందిన రాజకుటుంబాలు ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి అనుగ్రహం పొందారని చరిత్ర చెబుతోంది. రాజకుటుంబాలకు అవసరమైనప్పుడు ఎన్నో సార్లు సాయం చేసినందుకు నేటికీ ఆయా రాజకుంబాలవారు అమ్మవారిని తరచూ దర్శించుకుంటారు. అయితే ఇక్కడ తెల్ల ఎలుకల దర్శనం అందరికీ అవ్వదట. కేవలం అమ్మవారిపై ఎంతో భక్తి ఉన్నవారికి మాత్రమే ఈ తెల్ల ఎలుకలు కనిపిస్తాయని పురోహితులు చెబుతూ ఉంటారు. కర్ని మాత, ఆమె సంతానం ఇక్కడ తెల్ల ఎలుకల రూపంలో తిరుగుతూ ఉంటారని భక్తుల నమ్మకం. ఎలుకలు తిన్న ఆహారం, తాగిన పాలు మిగిలిపోగా వాటిని తీర్థ, ప్రసాదాలుగా తీసుకున్నప్పటికీ భక్తులెవ్వరు తమకు అనారోగ్యం కలిగిందని ఈనాటికి ఫిర్యాదు చెయ్యలేదు. సాధారణంగా ఎలుకలు ముట్టిన ఆహారం తింటే కలరా వంటి వ్యాధులు వస్తాయని వైద్య నిపుణుల చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చినవారికి అలాంటి వ్యాధులు ప్రభలకపోవడం ఆశ్యర్యకర విషయమే.