నయా పాకిస్తాన్ పేరుతో అధికారంలోకి వచ్చి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అన్నంత పనిచేస్తున్నాడు. మమూలుగా సొంతకార్లలో తిరిగి తిరిగి బోరుకొట్టించుకున్న నేతలు అధికారంలోకి రాగానే కొత్త కార్లు, లగ్జరీ కార్లు, అందునా బుల్లెట్ ఫ్రూఫ కార్లు ఎగబడి కొంటుంటారు. బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కూడా కొనడంతెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. అంతకు ముందున్న ముఖ్యమంత్రి వాడిని కార్లు ఎంత కొత్తవయినా వాడేందుకు ఒప్పుకోరు. అయతే, ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం దీనికి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంది. కొనడానికి బదులు ఉన్న కార్లన్నీ అమ్మేసి ప్రభుత్వ ఆర్థిక లోటును పూడ్చుకోవాలనుకుంటున్నారు ఈ రోజు ఏకంగా 34 లగ్జరీ కార్లను వేలం వేశారు.
పాక్ ప్రభుత్వం, కొన్ని బుల్లెట్ ప్రూఫ్ కార్లతో పాటు మొత్తం 102 లగ్జరీ కార్లున్నాయి. అంతేకాదు, ప్రధాని నివాసానికి శ్రేష్లమయిన పాలను సరఫరా చేసేందుకు పెంచుతున్న ఎనిమిది బర్రెలను కూడా వేలం వేస్తున్నారు. ఈ బర్రెలను గత ప్రధాని నవాజ్ షరీఫ్ కోసం ప్రత్యేకంగా సేకరించారు. వీటితో పాటు క్యాబినెట్ డివిజిన్ దగ్గిర వాడకుండా మూలన పడిన నాలుగు హెలికాప్టర్లను కూడా వేలం వేయాలనుకుంటునట్లు ప్రధాని రాజకీయ వ్యవహారాల ప్రత్యేక సహాయాధికారి నయీమ్ వుల్ హక్ పేర్కొన్నారు. ఈ రోజు అమ్మినవన్నీ లోక్ ల లగ్జరీ కార్లు. తొందర్లోనే
41 ఇంపోర్టెడ్ కార్లను అమ్మేస్తారు. వేలం వేయనున్నారు. ఈరోజు వేలంలో అమ్ముడుపోయిన 34 కార్లలో 4 మెర్సెడీజ్ బెంజ్ కొత్త మోడళ్లు, ఎనిమిది బుల్లెట్‌ప్రూఫ్ బీఎండబ్ల్యూ కార్లు, మూడు 5000 సీసీ ఎస్‌యూవీలు, రెండు 3000 సీసీ ఎస్‌యూవీలు ఉన్నాయి. ఇవి కాక 24 మెర్సిడీజ్ (2016 మోడల్) కార్లు కూడాఅమ్ముడు పోయాయి. తొందర్లో జరిగే రెండో వేలం పాటలో 40 టొయోటా కార్లు, ఓ లెక్సస్ ఎస్‌యూవీ, రెండు లాండ్ క్రూజర్లు వేలంలో ఉంటాయి.