దాడి ఆపండి… రష్యాకు అంతర్జాతీయ కోర్టు ఆదేశం

Russia-Ukraine War

ఉక్రెయిన్‌పై దాడిని నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) రష్యాను ఆదేశించింది. ఉక్రెయిన్‌ ఫిర్యాధుతో నెదర్లాండ్స్‌ హేగ్‌లోని అంతర్జాతీయ కోర్టు ఈ మేరకు బుధవారం పిలుపునిచ్చింది. ఐసీజే తీర్పుపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంతోషం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను రష్యా పాటించాలని సూచించారు. మరోవైపు రష్యా, ఉక్రెయిన్‌ మధ్య జరుతున్న చర్చల్లో కొంత పురోగతి కనిపించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ వివాదానికి తెర పడేలా కనిపిస్తోంది