Facebook: రష్యాకు షాక్ ఇచ్చిన ఫేస్‌బుక్.. ఇక ఆ వార్తలు కనిపించవు

Facebook to say goodbye to its classic look

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యన్‌ మీడియాకు సంబంధించిన అడ్వెర్‌టైజ్‌మెంట్లును నిషేధిస్తున్నట్టు వెల్లడించింది. ఫేస్‌బుక్‌ ద్వారా రష్యన్‌ మీడియాకు వచ్చే ఆదాయలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఫేస్‌బుక్ పేరెంట్ సంస్థ మెటా ప్రస్తుతం వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు నిర్వహిస్తుండగా కేవలం ఫేస్‌బుక్‌ ప్లాట్‌ఫామ్‌పైనే రష్యన్‌ మీడియాకు నిషేధం విధించింది. దీంతో రష్యన్‌ మీడియా పోస్ట్ చేసే సమాచారం ఇకపై ఫేస్‌బుక్‌లో కనిపించదు. సాధరణంగా రష్యన్ మీడియాపై అక్కడి ప్రభుత్వం యెుక్క తీవ్రమైన అంక్షలు ఉంటాయి. ఆ దేశ మీడియా పాలసీ ప్రకారం ప్రభుత్వ అధికారిక మీడియా అయిన రష్యాన్ టుడ్ వెల్లడించే సమాచారామే పెద్ద దిక్కు. ప్రస్తుత ఫేస్‌బుక్‌ నిర్ణయంతో రష్యాకు సంబంధించిన సమాచారం ప్రపంచానికి అందే అవకాశం చాలా తక్కువ