చనిపోయిన మనిషి తిరిగి మూడు గంటల తర్వాత బతికాడు. సండే రోజు ఖాళీగా ఉన్నామని కుళ్లు జోకులు వేయకండి అని మాత్రం అనకండి. ఎందుకంటే ఇది నిజం. మరణించాడని డాక్టర్లు కన్ఫామ్ చేసిన వ్యక్తి 3 గంటల తర్వాత బతికి కొత్త మిస్టరీని క్రియేట్ చేశాడు. ఈ క్రేజీ ఇన్సిడెంట్ కెన్యాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే..32 ఏళ్ల పీటర్ కిగెన్ వ్యక్తి అప్పటివరకు నార్మల్ గానే ఉన్నాడు. అప్పటికప్పుడే కడుపులో నొప్పి వస్తుందంటూ..అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని కాప్కాటెట్ హాస్పిటల్‌కు తరలించారు. సాయంత్రం 5.30 గంటలకు అపస్మారక స్థితిలోకి వెళ్లిన పీటర్ రాత్రి 07.45 గంటలకు చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
అనంతరం అతడి మృతదేహాన్ని మార్చురీ రూమ్ కు తరలించారు ఉంచారు. అసలు అతడి సమస్య ఏంటో తెలుసుకోవాలిని స్టాఫ్..పోస్ట్ మార్టం చేయడానికి..అతడి కాలిని కట్ చేశారు. దీంతో కిగెన్ ఒక్కసారిగా మేల్కోని నొప్పితో అరవడం ప్రారంభించాడు. దీంతో అక్కడున్న సిబ్బంది షాక్‌కు గురయ్యారు. తేరుకుని వెంటనే వైద్యులకు సమాచారం అందించారు. వైద్యులు అతడిని వివిధ టెస్టులు..ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారించారు. అయితే తను కళ్లు తిరిగి పడిపోవడానికి రీజన్ ఏంటో ఇప్పటికీ తెలీదని కిగెన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. భగవంతుడు తనకు మరో జీవితాన్ని ప్రసాదించాడని, తన మిగిలిన జీవితాన్ని దేవుడి సేవలో గడుపుతానని చెప్పుకొచ్చాడు.
అయితే ఈ విషయంలో తప్పు ఎవరిదో తెలియరాలేదు. ఎట్టకేలకు మరణాన్ని దాటి వచ్చిన పీటర్ కిగెన్‌ను చూసి ఫ్యామిలీ మెంబర్స్‌తో ఆనందంగా గడుపుతున్నాడు. ఇలాంటి ఇన్సిడెంట్లు ప్రపంచ వ్యాప్తంగా చాలా జరిగాయి. చనిపోయారని చెప్పిన వ్యక్తులు స్మశానానికి వెళ్లాక కూడా పాడె మీద నుంచి లేచి వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటికీ అంతిచిక్కని ప్రశ్నగానే మారింది. ఏది ఏమైనా ఈ ప్రపంచంలో మనిషికి తొంగని అతి కొద్ది వాటిల్లో చావు కూడా ఒకటి. మున్ముందు దీన్ని కూడా జయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. లెట్స్ వెయిట్ అండ్ సీ.