అమెరికా అంటే అందరికీ గుర్తొచ్చేది భూతల స్వర్గం. మన లాంటి దేశాలని ఒక 50 సంవత్సరాలు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూస్తే అమెరికా లాంటి దేశం కనిపిస్తుంది. అక్కడి జనాలు కులాలు మతాలు అతీతంగా దేశ ప్రగతి తన సొంత అభివృద్ధికి పెద్ద పీట వేస్తారు.
కానీ విచిత్రంగా ఇప్పుడు అక్కడ కూడా చర్చి మసీదు గొడవలు నడుస్తున్నాయి. అదేదో ప్రజలు చర్చి మసీదు అని కొట్లాడుకోవడం లేదు. ఇది ఆ దేశ అధ్యక్షుడు నోటి నుంచి వచ్చిన మాటలు. అందుకే అమెరికా ప్రజలే కాకుండా అభివృద్ధి చెందిన యూరోప్ దేశాలు కూడా ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే కరోనా తీవ్రంగా ఉండటం చేత ఏప్రిల్ 15 నాడు వచ్చిన ఈస్టర్ పండుగ సందర్భంగా అమెరికాలో ఉన్న చర్చిలు అన్ని మూసివేశారు. అది సామాజిక దూరం పాటించాలని అటు ప్రభుత్వ విజ్ఞప్తి తో పాటు చర్చి పెద్దలైనా ఫాదర్స్ పాస్టర్స్ అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం. ఇదేదో బలం ఉపయోగించిచర్చిలు మూసి వేయలేదు.
ఈ నేపథ్యంలో ట్విట్టర్ లో ఒక వ్యక్తి పెట్టిన ఒక ట్వీట్ కి ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రీ ట్వీట్ చేస్తూ “ చూడాలి మరి రంజాన్ కి ఈస్టర్ కు చర్చిలు మూసివేసినట్టు మసీదులు మూసివేస్తారు లేదో “ అని ఒక వివాదాస్పదమైన వ్యాఖ్య చేసాడు. విలేకరుల సమావేశంలో ఒక విలేఖరి డోనాల్డ్ ట్రంప్ ని ఈ విషయం పై స్పందించమని కోరగా ట్రంప్ తన ట్వీట్ లో చేసిన వ్యాఖ్యలు మళ్లీ వివరిస్తూ “ఇక్కడ చర్చిలకు ఒకలాగా మసీదులకు ఒకలాగా చట్టాలు ఉండాలని ప్రతిపక్షమైన డెమోక్రటిక్ పార్టీ కోరుకుంటుంది. నాకు కూడా ఆసక్తిగా ఉంది రంజాన్ అప్పుడు మసీదులు మూసివేస్తారో తెరిచి ఉంటారో చూడాలి” అని చెప్పడం జరిగింది.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ విధంగా మతపరమైన వ్యాఖ్యలు చేయడం అది రాజకీయానికి వాడుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే
WATCH: Video of Al-Jazeera correspondent questioning President Trump over retweeting @paulsperry_ tweet about enforcing social-distancing orders at mosques during upcoming Ramadan festivities like the orders were enforced at churches during Easterhttps://t.co/Peeg3MRbxy
— Paul Sperry (@paulsperry_) April 19, 2020