నేను చస్తే వాటికి ఆహారం అవుతాను.. కమెడియన్ వింత కోరిక

సాధారణంగా ఎవరైనా సరే చనిపోతే అవయవదానం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరికొందరు ఉన్నతమైన వారు తన శరీరం జూనియర్ డాక్టర్స్ కు ఉపయోగపడాలని ఏకంగా బాడీని మెడికల్ కాలేజ్ కోర్సుల కోసం డొనేట్ చేస్తారు. చనిపోయిన తరువాత మన వల్ల ఎదో ఒక మంచి జరిగితే చాలని చాలా మంది కోరుకుంటారు.

అయితే ఒక హాలీవుడ్ యాక్టర్ ఇటీవల వింత కోరికను కోరుకున్నాడు. అతను కోరుకున్న కోరిక సామాన్యమైనది కాదు. ఈ కాలంలో ఎవరు కూడా ఆ విదంగా చెప్పి ఉండకపోవచ్చు. బ్రిట‌న్‌ కమెడియన్ , నిర్మాత‌, ద‌ర్శ‌కుడు రికీ జెర్వీస్ ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పిన విష‌యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. రికీ ‘ఆఫ్టర్‌ లైఫ్‌’ అనే వెబ్‌సిరీస్‌లో నటించాడు. ‘ఆఫ్టర్‌ లైఫ్‌ 2’ గత ఏడాది విడుదలై మంచి హిట్ టాక్ ను కూడా తెచ్చుకుంది.

ఇక ఇంటర్వ్యూలో మరణాంతరం మీ మృతదేహాన్ని ఏం చేయాలని కోరుకుంటున్నారు? అని ప్రశ్నించగా.. వెంటనే అతను లండన్‌ జూలో ఉన్న సింహాలకు ఆహారంగా అందించాలని కోరడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే ఉన్నన్ని రోజులు ప్రకృతి నుంచి ఎన్నో మనం తీసుకున్నామని అంటూ కనీసం చనిపోయిన తరువాత మిగతా జంతువులకు తాను ఆహారంగా మారితే బావుంటుందని కోరుకున్నాడు. అతను అలా ఇచ్చిన సమాధానంకు ప్రతి ఒక్కరు షాక్ అవుతూ అతనిపై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.