మేషరాశి: ఉద్యోగంలో మార్పులు!
మీరు చేసే పనుల్లో మార్పుల వలన సమస్యలు ఎదుర్కొంటారు. అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు. మీ మాటలతో వాళ్లను సంతోష పెడతారు. కొన్ని దూరపు ప్రయాణాలు ఈరోజు వాయిదా వేసుకోవడమే మంచిది.
వృషభరాశి: శత్రువులకు దూరంగా ఉండాలి!
ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. శత్రువులకు ఈరోజు దూరంగా ఉండాలి. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఈ రోజు ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగానికి సంబంధించిన కొన్ని విషయాల గురించి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.
మిధునరాశి: దూరపు ప్రయాణాలు వాయిదా పడతాయి!
ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి. కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది. శత్రువులను మిత్రులుగా మార్చే గుణం ఈ రోజు మీలో ఉంటుంది. ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన అంత శుభమే జరుగుతుంది.
కర్కాటక రాశి: ఇరుగు పొరుగు వారితో వాదనలు!
ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ పూర్తి చేస్తారు. ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు అవసరం. బయట ఈరోజు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
సింహరాశి: ఖర్చులు తగ్గించుకోవాలి!
ఈరోజు మీ చిన్ననాటి స్నేహితులకు కలుస్తారు. వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు. అనవసరంగా డబ్బులే ఎక్కువ ఖర్చు చేస్తారు. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు వలన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతారు. ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో మీ తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.
కన్యరాశి: పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది!
మానసిక ఆందోళన ఈరోజు మీలో ఎక్కువగా ఉంటుంది. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఇతర వాటిపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది.
తులరాశి: ప్రారంభించిన వ్యాపారంలో ఇబ్బందులు!
ప్రారంభించిన వ్యాపారం ఈరోజు వాయిదా వేసుకోవడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చేయడమే మంచిది.
వృశ్చికరాశి: కుటుంబంలో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి!
కుటుంబంలో ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం చేస్తారు. దీంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనవసరంగా బయట వాదనలకు వెళ్లకపోవడమే మంచిది. తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రారంభించిన పనుల్లో ఇతరుల మాటలు కాకుండా మీ సొంత నిర్ణయాలు ఈరోజు బాగా అనుకూలంగా ఉంటాయి.
ధనుస్సురాశి: కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు!
మీ కుటుంబ సభ్యులు అంతా కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు చాలా అవసరం. కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఇతర వాటిపై కాకుండా మీరు చేసే పనుల్లో దృష్టి పెట్టాలి.
మకరరాశి: కొత్తగా ప్రారంభించిన పనుల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి!
ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి. మీరు ప్రారంభించిన పనుల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడమే మంచిది. అనవసరంగా ఈరోజు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగుతారు. బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా ఈరోజు తిరిగి చేతికి అందుతుంది.
కుంభరాశి: అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి!
స్నేహితుల వలన ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి ఈరోజు మీరు బయట పడతారు. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండటమే మంచిది. నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ అవకాశం ఉంటుంది.
మీనరాశి: ఇతరుల మనసును నొప్పించకూడదు!
ఈరోజు మీ మాటలు ఇతరుల మనసులను నొప్పిస్తాయి. ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ప్రారంభించిన పనుల్లో ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది