Today Horoscope: జనవరి 25వ తేదీ బుధవారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి!

దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు ఆహ్వానాల అందుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు. తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి. తరచు మీ నిర్ణయం మార్చుకోవడం వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

వృషభరాశి: ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది!

ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది. కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది. తరచూ మీ నిర్ణయాలను మార్చుకోవడం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు చేసే ఉద్యోగంలో గత కొంతకాలం నుండి తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరకదు. మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మిధునరాశి: మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు!

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

కర్కాటక రాశి: మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు!

మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు. కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. భూమికి సంబంధించిన విషయాలలో మీరు జోక్యం చేసుకోకపోవడం మంచిది. తరచు మీ నిర్ణయాలను మార్చుకోవడం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

సింహరాశి: అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది!

అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అందుతాయి. చాలా సంతోషంగా ఉంటారు.

కన్యరాశి: ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి!

ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు స్థాన చలనాలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. బయట ఊహించని వివాదాలు మానసికంగా చికాకు పరుస్తాయి. తొందరపడి దూర ప్రయాణాలు చేయకూడదు. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

తులరాశి: ఉద్యోగ వాతావరణం మరింత అనుకూలిస్తుంది!

ఉద్యోగ వాతావరణం మరింత అనుకూలిస్తుంది. రావలసిన సొమ్ము సకలంలో చేతికి అంటుతుంది. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నా అవకాశాలు లభిస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని దూర ప్రయాణాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. బయట ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

వృశ్చికరాశి: చేపట్టిన పనుల్లో అవాంతరాలు కొంత చికాకు పరుస్తాయి!

చేపట్టిన పనుల్లో అవాంతరాలు కొంత చికాకు పరిస్తాయి. దూరపు బంధువుల నుండి అందిన శుభవార్త కొంత ఊరట కలిగిస్తుంది. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. తొందరపడి వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.

ధనుస్సురాశి: వ్యాపారాలు ఆశించిన విధంగా రాణించవు!

వ్యాపారాలు ఆశించిన విధంగా రాణించవు. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. పుణ్యక్షేత్రాలు సంప్రదిస్తారు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

మకరరాశి: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది!

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది. కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు. తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ప్రయాణంలో కొన్ని ప్రమాదాలను ఎదుర్కొంటారు. మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.

కుంభరాశి: ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి!

ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి. ప్రారంభించిన పనులను వాయిదా వేయడం మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. కొందరి ముఖ్యమైన వ్యక్తులు కలుసుకుంటారు. మీరంటే గిట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీనరాశి: పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి!

పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణంలో మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. స్థలం కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉంటారు. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.