Today Horoscope: నవంబర్ 16వ తేదీ బుధవారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: దైవ కార్యములు నిర్వహిస్తారు!

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఎప్పటి నుండో అనుకుంటున్నా దైవ కార్యములు ఈరోజుతో పూర్తి చేస్తారు. కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు అవసరం. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.

వృషభరాశి: సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి!

కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో ఈరోజు మీరు పాల్గొంటారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలను పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ప్రారంభించిన పనుల్లో ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

మిధునరాశి: అప్పు తీర్చాలనే ప్రయత్నాల్లో ఉంటారు!

నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ అవకాశం ఉంటుంది. బయట అప్పుగా తీర్చాలనే ప్రయత్నంలో ఉంటారు. తోటి వారి సహాయంతో మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కొన్ని విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది.

కర్కాటక రాశి: బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు!

కుటుంబంలో కొన్ని బాధ్యతలను ఈరోజు మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు అవసరం. మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తలదూరుస్తారు. స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

సింహరాశి: వస్తువుల విషయాల్లో జాగ్రత్తలు అవసరం!

కొన్ని దూరపు ప్రయాణాలు ఈరోజు మీరు చేస్తారు. వస్తువుల విషయాలలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కన్యరాశి: శత్రువులకు దూరంగా ఉండడం మంచిది!

భూమికి సంబంధించిన విషయాలలో ఈరోజు మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. శత్రువుల నుండి ఈరోజు మీరు తెలివిగా బయటపడతారు. ఎప్పటినుండో నిలిపివేయబడ్డ పడులన్నీ ఇతరుల సహాయంతో ఈరోజు మీరు పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

తులరాశి: బంధువుల నుండి శుభవార్త అందుతుంది!

దూర ప్రాంత బంధువుల నుండి ఈరోజు మీకు ఒక శుభవార్త అందుతుంది. అది మీ మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. పిల్లల చదువు పట్ల ఈరోజు మీరు మరింత దృష్టి పెట్టడం మంచిది. ఎప్పటినుండో వాహనం కనుగోలు చేయాలనే మీ కోరిక ఈరోజుతో నెరవేరుతుంది. స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

వృశ్చికరాశి: ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు!

ఎప్పటినుండో ఉన్న ఆర్థిక సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు. కొన్ని కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది. మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది. అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.

ధనుస్సురాశి: అనారోగ్య సమస్యతో బాధపడతారు!

ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారు కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది. అనవసరమైన ఆలోచనలతో ఈరోజు మీరు సతమతమవుతారు. అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటారు.

మకరరాశి: మంచి అవకాశాలు ఉన్నాయి!

విద్యార్థుల కి ఈరోజు మంచి అవకాశాలు ఉన్నాయి. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన అంతా శుభమే జరుగుతుంది. ఇతరులు చెప్పిన మాటలకు అనవసరంగా మోసపోకండి. ప్రారంభించిన పనుల్లో మీ సొంత నిర్ణయాలు అవసరం.

కుంభరాశి: పనులు సకాలంలో పూర్తి చేస్తారు!

ఎప్పటినుండో ఉన్న ఆస్తి తగాదాలు నుండి ఈరోజు మీరు బయటపడతారు. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ఈరోజు మీకు మంచి పలుకుబడి పెరుగుతుంది. కుటుంబంలో మీకున్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. చాలా ఉత్సాహంగా ఉంటారు.

మీనరాశి: మీరు చేసే పనుల్లో శ్రమ పెరుగుతుంది!

చేసే పనుల్లో శ్రమ పెరిగినప్పటికీ దానికి తగ్గ ఫలితాలను పొందుతారు. సంతానం పట్ల బాధపడుతున్న వారు ఈరోజు వ్యక్తి పొందుతారు. ఆత్మీయుల రాకతో కొన్ని ఖర్చులు పెరుగుతాయి. బయట అప్పుగా ఇచ్చిన డబ్బు రావాల్సిన సమయానికి చేతికి అందుతుంది. వ్యాపార ఒప్పందాలు పలిస్తాయి.