మేషరాశి: కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు!
కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. భూమికి సంబంధించిన విషయాల గురించి. మీ సోదరులతో చర్చలు చేస్తారు. తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
వృషభరాశి: వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి!
వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారానికి సంబంధించిన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేస్తారు. కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. చాలా సంతోషంగా ఉంటారు.
మిధునరాశి: ఇతరుల విషయాల్లో మీరు జోక్యం చేసుకోకపోవడం మంచిది!
ఇతరుల విషయాలు మీరు జోక్యం చేసుకోకపోవడం మంచిది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వలన విశ్రాంతి ఉండదు. ఇతర పనులు పై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి.
కర్కాటక రాశి: దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది!
దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కొందరి ప్రవర్తన వలన మానసిక ఆందోళన తప్పదు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది. మీ స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించడం మంచిది.
సింహరాశి: ధన సహాయం లభిస్తుంది!
ధన సహాయం లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. మీ స్నేహితుల సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి మీకు ఎంత అనుకూలంగా ఉంది. కొందరు ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
కన్యరాశి: నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరిస్తాయి!
నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరిస్తాయి. మీరు చేసే పనిలో ఆదాయంకి మించిన ఖర్చులు పెరుగుతాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. దూర ప్రాంతాల బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.
తులరాశి: మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి!
మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్త్ర కొనుగోలు చేస్తారు. ప్రయాణంలో కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.
వృశ్చికరాశి: వృత్తి ఉద్యోగాల్లో అనుకూలిస్తాయి!
వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. అక్కడ కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు. ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది. గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలు అందుకుంటారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.
ధనుస్సురాశి: ఆరోగ్య సమస్యలనుంచి బయటపడతారు!
ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంత అనుకూలంగా ఉంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చాలా కాలంగా పూర్తికాని పనులు సకలంలో పూర్తి చేస్తారు. బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా సమయానికి మీ చేతికి అందుతుంది. మీ జీవిత భాగస్వామితో బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.
మకరరాశి: వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది!
వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల విషయాల్లో మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. మీ తోబుట్టువులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఎప్పటి నుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచనలు ఎంతో అవసరం
కుంభరాశి: మీ జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సంధర్మిస్తారు!
మీ జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సంధర్మిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు పలుస్తాయి. ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. ఇతరుల సహాయం సహకారాలు అందుతాయి. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. మీరు పని చేసే చోట పనికి తగిన ప్రతిఫలం కనిపించదు. పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.
మీనరాశి: మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి!
మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి. కొన్ని చెడుసావాసాలకు దూరంగా ఉండడమే మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది. కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది. తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.