Today Horoscope: నవంబర్ 15వ తేదీ మంగళవారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: ఆరోగ్య సమస్యలు ఉంటాయి!

ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది. అనారోగ్య సమస్యలు ఈరోజు మిమ్మల్ని బాధ పెడతాయి. దూరపు ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

వృషభరాశి: నూతన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు!

కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు. నూతన వస్తువులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకపోవడం మంచిది. మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.

మిధునరాశి: విందు వినోదల కార్యక్రమాల్లో పాల్గొంటారు!

తోబుట్టులతో కలిసి కొన్ని విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. భూమికి సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి: విదేశీ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి!

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించే చర్చలు చేస్తారు. విదేశీ ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు చేయాలి. మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తలదూరుస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

సింహరాశి: బంధు మిత్రులను కలుస్తారు!

కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోకుండా ఈరోజు మీ బంధుమిత్రులను కలుస్తారు. ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంది. అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

కన్యరాశి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి!

ఎప్పటినుండో ఉన్న ఆర్థిక సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు. కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచనలు అవసరం. గతంలో పెట్టుబడుల నుండి ఈరోజు మీరు మంచి లాభాలను పొందుతారు. స్థలం కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.

తులరాశి: ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది!

స్నేహితులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఈరోజు మీరు విజయం సాధిస్తారు. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. అనుకోని చోటు నుండి ఈరోజు మీకు డబ్బు చేతి కందుతుంది. చాలా సంతోషంగా ఉంటారు.

వృశ్చికరాశి: కొన్ని మార్పులు కోరుకుంటారు!

కుటుంబంలో కొన్ని మార్పులను ఈరోజు మీరు కోరుకుంటారు. తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యలనుండి ఈరోజు మీరు బయటపడతారు. ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

ధనుస్సురాశి: పేరు ప్రతిష్టలను పొందుతారు!

సమాజంలో ఈరోజు మీరు పేరు ప్రతిష్టాలను పొందుతారు. ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేశారు. ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతరుల సహాయం మీకు ఎప్పుడూ ఉంటుంది. పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

మకరరాశి: ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడకూడదు!

మానసిక ఆందోళనతో సతమతమవుతారు. ఇతరులను ఇబ్బంది పెట్టే మాటలు ఈరోజు మీరు మాట్లాడకూడదు. చేసే ఉద్యోగంలో మార్పుల వలన కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.

కుంభరాశి: కుటుంబంలో సమస్యలు మొదలవుతాయి!

కుటుంబంలో సమస్యలు మొదలవుతాయి. అనవసరంగా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.

మీనరాశి: చేసే పనులు అలసట ఎక్కువగా ఉంటుంది!

మీరు చేసే పనుల్లో ఈరోజు ఎక్కువగా అలసట ఉంటుంది. దాంతోపాటు మంచి లాభాలు కూడా అందుకుంటారు. మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు. వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కలక్షేపం చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తా అంతా మంచే జరుగుతుంది