Today Horoscope: డిసెంబర్ 27వ తేదీ మంగళవారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: దూర ప్రయాణాలు వాయిదా వేయాలి!

దూర ప్రయాణాలు వాయిదా వేయాలి. అనారోగ్య సమస్యతో సతమతమవుతారు. ప్రారంభించిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. భూమికి సంబంధించిన విషయాలలో మీరు తలదూర్చకుండా ఉండడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

వృషభరాశి: ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు!

ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో ఆకారణ వివాదాలు తప్పవు. ఆస్తి వివాదాలు మానసిక చికాకులు కలిగిస్తాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపార ఉద్యోగాలు మందగిస్తాయి. మీరంటే గిట్టని వారు మీ విషయాలు తలదూర్చడానికి ప్రయత్నిస్తారు. కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

మిధునరాశి: చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి!

చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సంప్రదించుకుంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమవుతుంది. ముఖ్యమైన పనుల శ్రమతో గాని పూర్తి కావు. కొన్ని వ్యవహారాల్లో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది. దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.

కర్కాటక రాశి: సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది!

సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు సమస్యలు తొలగుతాయి. చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. విందు వినోదల కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

సింహరాశి: వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి!

వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. ఉద్యోగాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. చాలా సంతోషంగా ఉంటారు.

కన్యరాశి: విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది!

విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. కుటుంబ సభ్యుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. బంధు వర్గంతో వివాదాలు తప్పవు. వ్యాపార ఉద్యోగాలు ఆశించిన విధంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చేయడం మంచిది కాదు. కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది. మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

తులరాశి: చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి!

చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగాల్లో కొన్ని ఇబ్బందులు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. ఎదుటివారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

వృశ్చికరాశి: పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు!

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు అవరోధాలు తొలుగుతాయి. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆత్మీయులతో బంధుత్వం పెరుగుతుంది. విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

ధనుస్సురాశి: వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి!

వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సన్నిహితులతో చిన్ననాటి వివాదాలు తప్పవు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. సోదరులతో ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాల్లో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలు విలువైనంత వరకు వాయిదా వేయడం మంచిది. దైవచింత పెరుగుతుంది. కొందరి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

మకరరాశి: చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు!

చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలు పదోన్నతులు పెరుగుతాయి. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. అకస్మిక ధన లాభం సూచనలున్నవి. నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. మీ మాటలతో ఇతరుల మనసుని ఆకట్టుకుంటారు.

కుంభరాశి: కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది!

కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. తరచు మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని బంధువులను ఎదుర్కొంటారు. గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో కడుపుతారు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. పెద్దవారితో చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

మీనరాశి: చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది!

చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
ఉద్యోగ అవకాశం ఉంటుంది. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది. ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.