Today Horoscope: నవంబర్ 22వ తేదీ మంగళవారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: మొహమాటం వలన సమస్యలు వస్తాయి!

మీరు చేసే ఉద్యోగంలో మొహమాటం వలన కొన్ని సమస్యలు వస్తాయి. మీ తెలివితేటలతో ఇతరుల మనసును ఆకట్టుకుంటారు. ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. కుటుంబంలో కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇతర వాటిపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా ఈరోజు దృష్టి పెట్టాలి.

వృషభరాశి: వ్యాపారాల్లో లాభం ఉంది!

మీరు చేసే వ్యాపారంలో ఈరోజు లాభం కలిసి వస్తుంది. వాహనం కొనుగోలు చేయాలనే మీ కోరిక ఈరోజుతో నెరవేరుతుంది. కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకపోవడం మంచిది.

మిధునరాశి: ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి!

మీరు ప్రారంభించే పనులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అనవసరంగా డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తారు. ఇతరుల వారిపై కోపం మీ కుటుంబ సభ్యులపై చూపిస్తారు. భూమికి సంబంధించిన విషయాలలో తోబుట్టులతో వాదనలకు దిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

కర్కాటక రాశి: ఇతరుల మనసును ఆకట్టుకుంటారు!

ఈరోజు మీ మాటలతో ఇతరుల మనసును ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దవదర్శనాలను చేసుకుంటారు. ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

సింహరాశి: సమయాన్ని వృధా చేయొద్దు!

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది. అనవసరంగా మీ విలువైన సమయాన్ని ఈరోజు వృధా చేయకండి. విద్యార్థులు ఈ రోజు చదువుపై మరింత దృష్టి పెట్టడం మంచిది. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారు ఈరోజు ఆరోగ్యం పట్ల కాస్త విశ్రాంతి తీసుకోవాలి.

కన్యరాశి: చేసే పనుల్లో ఇతరులపై ఆధారపడకండి!

మీరు చేసే పనుల్లో ఈరోజు ఇతర వారిపై ఆధారపడకండి. తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు. వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. అనుకోని చోటు నుండి ఒకశుభవార్త వింటారు.

తులరాశి: సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి!

రాజకీయ నాయకులు ఈరోజు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు ఇచ్చిన హామీలను విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి పై అధికారులతో చర్చలు చేస్తారు. మీరు ఏ పని ప్రారంభించిన అంతా శుభమే జరుగుతుంది.

వృశ్చికరాశి: వాదనలకు దూరంగా ఉండాలి!

ఈరోజు బయట వాదలకు దూరంగా ఉండటమే మంచిది. అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ అవకాశం ఉంది. కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.

ధనుస్సురాశి: విశ్రాంతి తీసుకోవాలి!

అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారు ఈ రోజు విశ్రాంతి తీసుకోవడం మంచిది. తొందరపడి మీరు ఏ పనులను ప్రారంభించకూడదు. కొన్ని ఆర్థిక సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు. కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

మకరరాశి: కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి!

కోపాన్ని ఈరోజు మీరు అదుపులో ఉంచుకోవడం మంచిది. మీ కోపం వల్ల ఇతరుల మనసును బాధ పెడతారు. శత్రువులు ఈరోజు మీ విషయాల్లో తలదూర్చి అవకాశం ఉంది. కాబట్టి దూరంగా ఉండటమే మంచిది. మీ సొంత నిర్ణయాలతో ఈరోజు కొన్ని కొత్త పనులను ప్రారంభిస్తారు. చాలా సంతోషంగా ఉంటారు.

కుంభరాశి: మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి!

ఈరోజు ఇతర పనులపై కాకుండా మీ లక్ష్యంపై కూడా దృష్టి పెట్టాలి. పట్టుదలతో మీరు ఏ పని చేసినా అంతా శుభమే జరుగుతుంది. స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు. సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.

మీనరాశి: నిర్ణయాలు తరచూ మార్చవద్దు!

చేసే పనుల్లో తరచుగా నిర్ణయాలు మారడం వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలు ఎదురయ్య అవకాశం ఉంది. ఇరుగు పొరుగు వారితో ఈరోజు మీరు వాదనలకు దిగే అవకాశం ఉంది.