Today Horoscope: నవంబర్ 24వ తేదీ గురువారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది!

మీరు చేసే ఉద్యోగంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను త్వరగా పూర్తి చేస్తారు. ఈరోజు మీ చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వారితో కలిసి కొన్ని విందు వినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.

వృషభరాశి: నూతన పనులకు శ్రీకారం చుడతారు!

ఈరోజు వాహనయోగం ఉంది. గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. నూతన పనులకు ఈరోజు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో హాజరవుతారు. మీరంటే గిట్టని వారికి ఈరోజు దూరంగా ఉండటమే మంచిది. కొందరి ముఖ్యమైన వ్యక్తులతో ఈరోజు మీరు చర్చలు చేస్తారు.

మిధునరాశి: ఇంట బయట ఒత్తిడులు పెరుగుతాయి!

ఈరోజు మీరు పని చేసే చోట అలసట ఎక్కువగా ఉంటుంది. ఇంట బయట ఒత్తిడులతో ఈరోజు మీరు సతమతం అవుతారు. ఇతర వాటిపై కాకుండా ఈరోజు మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది. బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఈరోజు మీరు వసూలు చేస్తారు. కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

కర్కాటక రాశి: ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు!

కొన్ని కొత్త పనులు ప్రారంభించాలనే ఆలోచనలో ఉంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఈరోజు మీకు ఆటంకాలు తప్పవు. కొన్ని దూరపు ప్రయాణాలను ఈరోజు వాయిదా వేసుకోవడమే మంచిది. కుటుంబంలో ఈరోజు కొద్దిపాటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. భూమికి సంబంధించిన విషయాలలో ఈరోజు మీరు జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిది.

సింహరాశి: ముఖ్యమైన పనులను వాయిదా వెయ్యడం మంచిది!

వృత్తి వ్యాపారాల్లో ఈరోజు శ్రమ పడ్డ ఫలితాలు అంతగా కనిపించవు. మీ సోదరులతో ఆస్తి విభేదాలు కలుగుతాయి. తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. దూర ప్రాంతాల నుండి ఈరోజు మీకు ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.

కన్యరాశి: చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి!

రాజకీయ నాయకులు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలను పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి మీరు ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకూడదు. పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

తులరాశి: సమాజంలో పరిచయాలు పెరుగుతాయి!

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయం సహకారాలు పొందుతాయి. ఉద్యోగంలో కొన్ని బాధ్యతలను తీసుకుంటారు. మీరు ఏ పని ప్రారంభించిన ఈరోజు అంతా శుభమే జరుగుతుంది. తోటి వారి సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

వృశ్చికరాశి: ఆర్థిక ఇబ్బందులు చికాకులు వస్తాయి!

ఆర్థిక ఇబ్బందులు చికాకులతో సతమతమవుతారు. కొన్ని ప్రారంభించే పనులను ఈరోజు మీరు వాయిదా వేసుకోవడమే మంచిది. మీ ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. దూరపు ప్రయాణాలను ఈరోజు మీరు వాయిదా వేసుకోవడమే మంచిది. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

ధనుస్సురాశి: నూతన వస్తువులను, బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు!

కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు మీరు బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు. నూతన వస్తువులను, బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే ముందు ఆలోచించడం మంచిది. దూర ప్రాంతాల నుండి ఈరోజు బంధువులు వచ్చే అవకాశం ఉంది. అనుకోని చోటు నుండి ఈరోజు మీరు శుభవార్తలు వింటారు. అది మీ మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

మకరరాశి: ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి!

ప్రారంభించే పనుల్లో ఈరోజు మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. లేదంటే కొద్దిపాటి సమస్యలను ఎదుర్కొంటారు. బయట అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి ఆలస్యం అవుతుంది. ఇతరులతో ఈరోజు మీరు వాదనలకు దిగే అవకాశం ఉంది. తరచూ మార్చుకునే మీ నిర్ణయాలు వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

కుంభరాశి: శుభకార్యాలలో పాల్గొంటారు!

కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. నిరుద్యోగులు ఈరోజు కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు. భూమికి సంబంధించిన విషయాలలో ఈరోజు మీరు తల దూర్చకుండా ఉండడం మంచిది.

మీనరాశి: వ్యాపారాల్లో లాభాలు పొందుతారు!

వ్యాపారాల్లో ఈరోజు మీరు మంచి లాభాలను పొందుతారు. వాహనం కొనుగోలు చేయాలనే కోరిక ఈరోజుతో నెరవేరుతుంది. స్నేహితుల వలన ఈరోజు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులను ఇతరుల సహాయంతో ఈరోజు మీరు పూర్తి చేస్తారు. విద్యార్థులు ఈరోజు ఇతర వాటిపై కాకుండా మీ చదువుపై కూడా దృష్టి పెట్టడమే మంచిది.