Today Horoscope: డిసెంబర్ 22వ తేదీ గురువారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: చేపట్టిన పనులు ముందుకు సాగవు!

చేపట్టిన పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కొండ దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది.

వృషభరాశి: చేపట్టిన పనుల్లో శ్రమ ఫలిస్తుంది!

చేపట్టిన పనులు శ్రమ పలుస్తుంది.
వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు పని ఒత్తిడి నుండి బయట పడతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొన్ని వ్యవహారాల్లో ఆలోచనలు కార్యరూపం దలుస్తాయి. భూమికి సంబంధించిన విషయాలలో మీరు తల దూర్చకుండా ఉండడమే మంచిది. మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి. అనుకోని చోటు నుండి ఆహ్వానాలు అందుతాయి.

మిధునరాశి: దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు!

దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాల్లోనూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. చాలా సంతోషంగా ఉంటారు.

కర్కాటక రాశి: దూర ప్రయాణాలు వాయిదా పడతాయి!

దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనుల్లో శ్రమదిక్యాత పెరుగుతుంది. ఉద్యోగాల అధికారుల నుండి సమస్యలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు. పెట్టుబడి విషయాల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.

సింహరాశి: బంధువుల నుంచి ఋణ ఒత్తుడులు అధికమవుతాయి!

బంధువుల నుండి ఒత్తుడులు అధికమవుతాయి. నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పులను ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

కన్యరాశి: వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం సేకరిస్తారు!

వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం సేకరిస్తారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహవంతంగాసాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు అవుతాయి. సమాజంలో ప్రముఖుల ఆధారణ పెరుగుతుంది. పెట్టుబడి విషయాల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.

తులరాశి: బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి!

బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. శత్రువులకు దూరంగా ఉండాలి. ఉద్యోగాల ధన పని భారం వలన తగిన విశ్రాంతి ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనిలో ప్రతిబంధకాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణంలో కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వృశ్చికరాశి: చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాల అందుతాయి!

చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో అధికారులు అనుగ్రహం కలుగుతుంది. విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

ధనుస్సురాశి: చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి!

చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు వ్యాయాప్రయాసలతో కానీ పూర్తి కావు. వ్యాపారాల్లో గందరగోల పరిస్థితులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో కొన్ని ఇబ్బందులు తప్పవు. బంధుమిత్రుల నుంచి ఒత్తుడులు అధికమవుతాయి. ఆధ్యాత్మిక చింతన అవుతుంది. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. వారితో కలిసి కొన్ని విషయాల గురించి చర్చ చేస్తారు.

మకరరాశి: వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి!

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. అప్పుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. సంతానానికి నూతన విద్య అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యక్తిగత విషయాలను ధరలతో పంచుకోకండి. ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

కుంభరాశి: ఉద్యోగాల్లో ఆశించిన పదవులు పొందగలుగుతారు!

ఉద్యోగాల్లో ఆశించిన పదవులు పొందగలుగుతారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాలు చికాకులు తొలగుతాయి. ఇతరుల సహాయ సహకారాలు అవ్వుతాయి. అప్పుల నుంచి శుభవార్త ఉంటాయి. నూతన వాహనయోగం ఉన్నది. ఇతరుల నుండి మీ సొమ్ము సమయానికి చేతికి అవుతుంది.

మీనరాశి: చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి!

చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాల్లో ఇతరుల నుండి ఊహించని సమస్యలుఎదురవుతాయి. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. చాలా ఉత్సాహంగా ఉంటారు.