మేషరాశి: సంతానం కొన్ని విషయాల్లో మీ మాటతో విభేదిస్తారు!
సంతానం కొన్ని విషయాల్లో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు తప్పవు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అతను బాధ్యతలు పెరుగుతాయి. ప్రారంభించిన పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ సకలంలో పూర్తవుతాయి. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. స్నేహితుల సహాయంతో కొన్ని పనులను ప్రారంభిస్తారు.
వృషభరాశి: ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది!
ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో స్వంత ఆలోచనలు పనిచేయవు. వ్యాపార ఉద్యోగాలు నిలకడగా లోపిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
మిధునరాశి: పాత రుణాలు కొంత వరకు తీరుతాయి!
పాత రుణాలు కొంతవరకు తీరుతాయి. ఆర్థిక ఇబ్బందులు నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగమున సానుకూల వాతావరణం ఉంటుంది. నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు పొందుతారు. ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
కర్కాటక రాశి: కొన్ని వ్యవహారాల్లో ఇంటా బయట సమస్యలు కలుగుతాయి!
కొన్ని వ్యవహారాల్లో ఇంట బయట సమస్యలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. ఉద్యోగమున కీలక నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. దూర ప్రాంతాల నుంచి అందిన వార్త కొంత బాధ కలిగిస్తుంది. ఆదాయం ఆశించిన విధంగా ఉండదు. పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. ధైర్యంతో ముందుకు వెళ్లాలి.
సింహరాశి: స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి!
స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో గృహముల సంతోషంగా గడుపుతారు. వ్యాపారమున అప్పుల నుంచి పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలు నూతన అవకాశములు అందుతాయి. ఆకస్మిక ధనలబ్ది పొందుతారు. పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఎంతో అనుకూలంగా ఉంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
కన్యరాశి: ధన్యవాదాలు వ్యవహారాల్లో లోటుపాట్లు ఉంటాయి!
ధన్యవాదాలు వ్యవహారాల్లో లోటుపాట్లు ఉంటాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. భాగస్వామ్య వ్యవహారాలు మందగిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు మీకు అంతగా పనికిరావు. కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.
తులరాశి: సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది!
సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు ధన సహాయం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశం లభిస్తాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. నూతన వ్యవహారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ఇతరుల నుండి రావాల్సిన సొమ్ము సమయానికి చేతికి అందుతుంది. చాలా సంతోషంగా ఉంటారు.
వృశ్చికరాశి: ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగు పడుతుంది!
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. దూర ప్రాంతాల బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గృహమున సంతోషంగా గడుపుతారు. ఉద్యోగంలో ఉన్నత అధికారుల ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన కార్యక్రమాల విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. చాలా ఉదాహంగా ఉంటారు.
ధనుస్సురాశి: వ్యాపారాల్లో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు!
వ్యాపారాల్లో నూతన ఉత్సాహాలతో లాభాలు అందుకుంటారు. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తవుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రయాణాలు మార్గ అవరోధాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దలతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.
మకరరాశి: ఆర్థిక ఇబ్బందుల వలన బాధలు పెరుగుతాయి!
ఆర్థిక ఇబ్బందుల వలన బాధలు పెరుగుతాయి. ఆ కారణంగా కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. నూతన ఋణ యత్నాలు అంతగా కలిసి రావు. ఆరోగ్య విషయాల్లో వైద్య సంప్రదింపులు చేయడం మంచిది. కుటుంబ వాతావరణం మరింత చికాకు కలిగిస్తుంది. ఇతరులతో వాదనలకు దిగా అవకాశం ఉంది.
కుంభరాశి: సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు!
సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు. ఉద్యోగమని అదనపు బాధ్యతలు నుండి ఉపశమనం లభిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు.వ్యాపారమున నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. దీర్ఘకాలిక రుణాలు తీరి ఉరట చెందుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంది.
మీనరాశి: సన్నిహితుల సలహా సహకారంతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు!
సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఇంకా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వ్యవహరించాలి. నిరుద్యోగులకు ప్రయత్నంగా నూతన అవకాశంలో అందుతాయి. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.