Today Horoscope: జనవరి 29వ తేదీ ఆదివారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి!

నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలకు అధిక లాభాలు అందుతాయి. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.

వృషభరాశి: వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి!

వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో వివాదాలు చికాకు పరుస్తాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది. తరచూ మీ నిర్ణయాలను మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మిధునరాశి: అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు!

అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు. తొందరపడిన వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.

కర్కాటక రాశి: భూమికి సంబంధించిన విషయాలు జోక్యం చేసుకోకపోవడం మంచిది!

భూమికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. తరచూ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల మీకు విశ్రాంతి దొరకదు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందుల్లోనే ఎదుర్కొంటారు.

సింహరాశి: తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు!

తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది. అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు. మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది. ఆర్థికంగా డబ్బులు ఎక్కువ ఖర్చవుతాయి. కొందరి ముఖ్యమైన వ్యక్తులు కలుసుకుంటారు. వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కన్యరాశి: భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు!

భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు. మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ఆత్మీయుల నుండి ఆహ్వానాల అందుతాయి. చాలా సంతోషంగా ఉంటారు.

తులరాశి: మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది!

మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది. ప్రారంభించిన పనులను చాలా నిదానంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగా అవకాశం ఉంది. మీరు చేసే చిన్న చిన్న పొరపాటున వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. దూరపు బంధువుల నుండి ఆహ్వానాల అందుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

వృశ్చికరాశి: మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు!

మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో కుటుంబ సభ్యులతో మాట్లాడడం మంచిది. బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

ధనుస్సురాశి: ఆరోగ్యం కుదుటపడుతుంది!

అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొందరి ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. వారితో పాత విషయాలు జ్ఞాపకం చేసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

మకరరాశి: మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు!

మీరంటే గిట్టని వారి విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు. తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది. కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది. కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు. ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

కుంభరాశి: పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి!

పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వారితో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు. వాహనం కొనుగోలు చేయాలచె ఆలోచనలో ఉంటారు. సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా తిరిగి ఇచ్చేది అందుతుంది. చాలా సంతోషంగా ఉంటారు.

మీనరాశి: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటుంది!

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది. కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. కొందరి ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. చాలా ఉత్సాహంగా ఉంటారు