Today Horoscope: నవంబర్ 27వ తేదీ ఆదివారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి!

కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు. ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. కొన్ని పనులను పూర్తి చేస్తారు. దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది. కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

వృషభరాశి: చేపట్టిన పనులు వాయిదా వేస్తారు!

రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన సమస్యలను ఎదుర్కొంటారు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని కొత్త పరిచయాలు ఈరోజు మీకు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకూడదు.

మిధునరాశి: దైవదర్శనం చేసుకుంటారు!

కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. అది మీ మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. కొన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేస్తారు. పెట్టుబడి విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.

కర్కాటక రాశి: నూతన వాహనం కొనుగోలు చేస్తారు!

మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. ఇంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు. అనుకోని చోటు నుండి డబ్బు చేతికి అందుతుంది.

సింహరాశి: ముఖ్యమైన పనులు మధ్యలోనే నిలిపివేస్తారు!

మీరు చేసే ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. ముఖ్యమైన పనులను మధ్యలోనే నిలిపివేస్తారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. కుటుంబంలో చికాకులు మొదలవుతాయి. ఇతర వారిపై కోపం మీ కుటుంబ సభ్యులపై చూపిస్తారు. అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.

కన్యరాశి: చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి!

చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృధా ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. మీరు చేసే ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. శ్రమకు తగిన ఫలితాలు అంతగా ఉండవు. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్తికి సంబంధించిన తగాదాలకు దూరంగా ఉండటమే మంచిది. మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.

తులరాశి: కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు పెరుగుతాయి!

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. బంధుమిత్రులతో విందు వినోదల కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట బయట ఊహించిన ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికరాశి: ఉద్యోగంలో జాగ్రత్తలు అవసరం!

మీరు చేసే ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక సమస్యలు సతమతం చేస్తాయి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇంకా బయట పరిస్థితులు అనుకూలించవు. విద్యార్థులకు నూతన అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే ప్రయాణంలో నూతన పరిచయాలు కలుగుతాయి.

ధనుస్సురాశి: ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి!

వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. ఇంకా బయట సమస్యలు బాధిస్తాయి. ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక చికాకులు కలుగుతాయి. నిరుద్యోగులు కష్టపడ్డ ఫలితాలు ఉండవు. బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

మకరరాశి: నిరుద్యోగులు శుభవార్త వింటారు!

తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితులు కొద్దిగా మెరుగుపడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. స్నేహితుల సాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారం చాలా వరకు నిలకడగా సాగుతుంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చాలా సంతోషంగా ఉంటారు.

కుంభరాశి: శత్రువులకు దూరంగా ఉండటం మంచిది!

మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు. పై అధికారులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. తరచూ మార్చుకునే మీ నిర్ణయాలు వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని దూరపు ప్రయాణాలను వాయిదా వెయ్యడమే మంచిది.

మీనరాశి: కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు!

రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు చేసే పనుల్లో అంతా శుభమే జరుగుతుంది. మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ మాటలతో ఇతరుల మనసుని ఆకట్టుకుంటారు.