మేషరాశి: మీరు చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి!
ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులు ఈరోజు పూర్తి చేయాలనే ఆలోచనలో ఉంటారు. మీరు మాట్లాడే మాటలతో ఇతరుల మనసును ఆకట్టుకుంటారు. కానీ ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకపోవడం మంచిది.
వృషభరాశి: శత్రువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది!
భూమి గొడవల నుండి ఈరోజు మీరు బయటపడతారు. మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తలదూరుస్తారు. శత్రువు మిత్రులుగా మారినట్టు నటిస్తారు. వారితో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
మిధునరాశి: కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు!
ఈరోజు మీరు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో మంచి గౌరవాన్ని ప్రతిష్టాన్ని పొందుతారు. మీరు ప్రారంభించిన పనుల్లో మంచి విజయాలు సాధించి గొప్ప బహుమతులు అందుకుంటారు. బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
కర్కాటక రాశి: పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది!
ఈరోజు కుటుంబ సభ్యులతో కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు. పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. మీ విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.
సింహరాశి: కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి!
ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది. కుటుంబ సభ్యులతో మీ సుఖ సంతోషాలను పెంచుకుంటారు.
కన్యరాశి: మీరు చేసే ఉద్యోగంలో మార్పులు!
గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు. మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొందరి ముఖ్యమైన వ్యక్తులతో కలిసి చర్చలు చేస్తారు. తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
తులరాశి: మీ ఆవేశంతో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు!
భూమి గొడవలు ఈరోజు మీలో మొదలవుతాయి. ఈరోజు మీరు ఆవేశం తగ్గించుకోవడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కోర్టుకు సంబంధించిన పనులు వాయిదా పడతాయి. అనవసరంగా ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి. సొంత నిర్ణయాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి.
వృశ్చికరాశి: అనారోగ్య బాధలతో సతమతమవుతారు!
ఈరోజు మీరు ఇతర వాటిపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి. కొన్ని ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది. అనుకోకుండా ఈరోజు మీకు ఇంటికి బంధువులు వస్తారు. మీ మాటలు వాళ్ళ మనసును ఎంతో సంతోష పెడుతాయి.
ధనుస్సురాశి: ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి!
ఎప్పటినుండో ఉన్న ఆర్థిక పరిస్థితులు నుండి బయట పడతారు. కొన్ని కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచన అవసరం. కొందరి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.
మకరరాశి: విందు వినోదాల్లో పాల్గొంటారు!
ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు. అనవసరంగా డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.
కుంభరాశి: కుటుంబ సభ్యులతో వాదనలు!
మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇతర వాళ్లపై కోపం కుటుంబ సభ్యులపై చూపిస్తారు. నిరుద్యోగ ఈరోజు ఉద్యోగ అవకాశం ఉంటుంది. ఇతరుల సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
మీనరాశి: వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది!
ప్రారంభించిన పనుల్లో అంతా శుభమే జరుగుతుంది. గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు. మీరు చేసే వ్యాపారంలో కూడా మంచి లాభాలను పొందుతారు. బయట అప్పు తీర్చడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది