Today Horoscope: నవంబర్ 6వ తేదీ ఆదివారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది!

పై అధికారులతో ఈ రోజు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. మీరు చేసే పనుల్లో ఒత్తిడి పెరగడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు. మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తలదూరుస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

వృషభరాశి: ఈరోజు ఆర్థిక లాభాలు అందుతాయి!

ఈరోజు మీరు చేసే పనిలో అంతా మంచే జరుగుతుంది. ఎప్పటినుండో పెట్టిన పెట్టుబడుల నుండి ఈరోజు ఆర్థిక లాభాలు అందుకుంటారు. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు బాగా కలిసి వస్తుంది. మీ కుటుంబ సభ్యులకు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ధైర్యంతో ఏ పని మొదలుపెట్టిన అంతా మంచే జరుగుతుంది.

మిధునరాశి: ఈరోజు మీ ఆరోగ్యం కుదుట పడుతుంది!

ఎప్పటినుండో వాయిదా పెట్టిన పనులన్నీ ఈరోజు మీరు పూర్తి చేస్తారు. అనారోగ్య సమస్యతో ఉన్న మీరు ఈరోజు కోలుకుంటారు. అనుకోకుండా ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విలువైన వస్తువుల్ని కాపాడుకోవడమే మంచిది. ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకపోవడం మంచిది.

కర్కాటక రాశి: ఇతరులను కిందపరిచే మాటలు మాట్లాడకూడదు!

ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగకపోవడమే మంచిది. మీ మాటలతో ఇతరులను మనసును నొప్పిస్తారు. అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మళ్ళి కలుస్తారు. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు. కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

సింహరాశి: ఎదుటివారికి సహాయం చేయు గుణం మీలో ఉంటుంది!

మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు. ఎదుటి వారికి సహాయం సహాయం చేయు గుణం మీలో ఉంటారు. ఎప్పటినుండో స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచన ఈరోజు మీకు నెరవేరుతుంది. ఎప్పటినుండో ఉన్న గొడవల నుండి ఈరోజు మీరు బయటపడతారు. చాలా సంతోషంగా ఉంటారు.

కన్యరాశి: డబ్బు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తారు!

కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. డబ్బు సంపాదించాలనే ఆలోచన మీలో మొదలవుతుంది. ఈరోజు మీరు చేసే పనుల్లో బాగానే కలిసి వస్తుంది. చాలా ఉత్సాహంగా ఉంటారు.

తులరాశి: ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలి!

ఈరోజు అనుకోని పరిచయాలు మీకు ఏర్పడతాయి. మీకు శత్రువులుగా ఉన్నవారు మిత్రులుగా నటిస్తారు. వారితో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అనవసరంగా మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికరాశి: ముఖ్యమైన పనిలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు!

ఎప్పటినుండో ఉన్న భూమి గొడవల నుండి ఈరోజు మీరు బయట పడతారు. ప్రారంభించిన పనుల్లో మీ సొంత నిర్ణయాలు నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయండి. కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సురాశి: మీలో దైవభక్తి ఎక్కువగా ఉంటుంది!

కుటుంబ సభ్యులతో కలసి యాత్రలకు వెళ్తారు. ఈరోజు దైవదర్శనం మీకు బాగా జరుగుతుంది. మీరు చేసే ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఈ రోజు ఆరోగ్యంగా ఉంటారు.

మకరరాశి: ఒక శుభవార్త వింటారు!

ఈరోజు మీరు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు. అది మీ మనసులో ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఈ రోజు మీకు వసూలు అవుతుంది. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల్లో అంతా మంచే జరుగుతుంది.

కుంభరాశి: ఏ పని చేసిన ఇతరుల సహాయం అందుకుంటారు!

మీరు ప్రారంభించిన పనిలో ఇతరుల సహాయం ఉంటుంది. సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టాలను పొందుతారు. అనవసరంగా ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి. శత్రువులను మిత్రులుగా మార్చే గుణం మీలో ఉంటుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

మీనరాశి: కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది!

ఈరోజు మీరు చేసే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. కొందరి ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఈరోజు మీకు ఏర్పడతాయి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడమే మంచిది.