మేషరాశి: వ్యాపారంలో ఫలితాలు ఫలిస్తాయి!
చేపట్టిన పనులు ప్రయత్నంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. కుటుంబ సలహాలతో ముందుకు సాగడం మంచిది. కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది. స్నేహితుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది. వ్యాపారాలలో మంచి ఫలితాలు ఉంటాయి.
వృషభరాశి: కొన్ని సమస్యలు తొలగిపోతాయి!
వృత్తి ఉద్యోగాల్లో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి. నిరుద్యోలకు నూతన అవకాశములు అందుతాయి. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. మీ చిన్ననాటి స్నేహితులతో విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.
మిధునరాశి: వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది!
ఈరోజు కొన్ని వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. తొందరపడి ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. మీ ఆరోగ్యం పై మరింత దృష్టి పెట్టాలి. విద్యార్థుల విదేశాలు చదవాలనే ఆలోచనలో ఉంటారు. సమయానికి డబ్బు చేతికి కడుతుంది.
కర్కాటక రాశి: దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు!
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములున్నవి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపార విషయంపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. కొన్ని దూరపు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి.
సింహరాశి: కొన్ని శుభవార్తలు వింటారు!
సంతానం విద్య, ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున ఆశించిన పదవులను పొందుతారు. నూతన వ్యాపారాలకు కుటుంబ సభ్యుల నుండి పెట్టుబడులు అందుతాయి. ఇంటా బయట గౌరవ మర్యాదలను పొందుతారు. నూతన వస్తువులను బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.
కన్యరాశి : కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది!
ఉద్యోగమున ఆలోచించి ముందుకు సాగడం మంచిది. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక సమయంలో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. భూమికి సంబంధించిన విషయాల్లో మీరు తల దూర్చకుండా ఉండడమే మంచిది. మీ తోబుట్టులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
తులరాశి: వృత్తి వ్యాపారాల్లో లాభాలను పొందుతారు!
వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు చేసి లాభాలను పొందుతారు. సంఘంలో ప్రముఖ పరిచయాలు లభిస్తాయి. ఉద్యోగములో అధికారుల ఆధారణ పొందుతారు. బంధుమిత్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ధన వ్యవహారంలో అనుకూలత కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు పలుస్తాయి.
వృశ్చికరాశి: వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి!
చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది. ఆదాయం మించిన ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణాల్లో వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. మీరు చేసే పనిలో కొన్ని ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.
ధనుస్సురాశి: కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి!
కీలక వ్యవహారాల్లో తొందరపాటు వలన కొన్ని సమస్యలు ఉంటాయి. మిత్రుల నుండి ఊహించిన రుణ ఒత్తిడి కలుగుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయం సహకారాలు పొందుతారు. వ్యాపారమున సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులు శుభవార్త వింటారు.
మకరరాశి: మీరు చేసే ఉద్యోగంలో ఫలితాలు కనిపించవు!
మీరు చేసే ఉద్యోగంలో కష్టానికి తగిన ఫలితాలు కనిపించవు. గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తలు ఎంతో అవసరం. అనుకోని చోటు నుండి డబ్బు చేతికి అందుతుంది.
కుంభరాశి: ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు!
మీరు ఏ పని ప్రారంభించినా చాలా త్వరగా పూర్తి చేస్తారు. సమాజంలో మంచి పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంలో మీకు ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి: ఇతరుల మనసును బాధ పెట్టకూడదు!
మీ మాటలతో ఇతరుల మనసును బాధ పెడతారు. తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలను ఎదుర్కొంటారు. వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.