మేషరాశి: నిర్ణయాలు అనుకూలంగా సాగుతాయి!
వృత్తి వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా సాగుతాయి. భూమికి సంబంధించిన విషయాల్లో మీకు బాగా కలిసి వస్తుంది. చేపట్టిన పనులను సకలంలో పూర్తి చేస్తారు. మీ మాటలతో ఇతరుల మనసుని ఆకట్టుకుంటారు. మీరు ఏ పని ప్రారంభించిన ఈరోజు అంతా శుభమే జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ఆత్మీయుల నుండి సహకారం అందుతుంది.
వృషభరాశి: శ్రమకు తగిన ఫలితం దక్కదు!
మీరు చేసే పనిలో శ్రమకు తగిన ఫలితం దక్కదు. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది. తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది. కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. ధైర్యంతో ముందుకు వెళ్లాలి.
మిధునరాశి: వైద్యుల్ని సంప్రదింపులు చేయాలి!
ఆరోగ్య సమస్యలతో సతమతమవుతారు. వైద్యుల్ని సంప్రదించడమే మంచిది. కొన్ని దూరపు ప్రయాణాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు. మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
కర్కాటక రాశి: దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు!
మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసిక చికాకులు కలిగిస్తుంది. విద్యార్థులు ఇతర పనులపై కాకుండా మీ చదువుపై కూడా దృష్టి పెట్టాలి. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.
సింహరాశి: ఆదాయ మార్గాలు అనుకూలంగా సాగుతాయి!
బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు. అది మీ మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా సాగుతాయి. ఇతరుల ప్రవర్తన ఈరోజు మీ మనసును బాధ పెడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. రావలసిన సొమ్ముసకలంలో వసూలు అవుతుంది. కుటుంబ వాతావరణంలో చాలా సంతోషంగా ఉంటారు.
కన్యరాశి: శత్రువుల నుండి బయటపడతారు!
శత్రు పరమైన విషయాల నుండి తెలివిగా బయటపడతారు. స్నేహితుల నుండి ధన సహాయం అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చెయ్యకపోవడం మంచిది కాదు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడుల విషయాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
తులరాశి: వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఉంటాయి!
వృత్తివ ఉద్యోగంలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. మీ జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి. మీ చిన్ననాటి స్నేహితుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకునే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
వృశ్చికరాశి: వృధా ఖర్చులు పెరుగుతాయి!
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.
ధనుస్సురాశి: నిరుద్యోగులు కష్టపడాల్సి వస్తుంది!
ధనపరంగా ఒడిదుడుకులు తప్పవు. శ్రమకు తగిన ఫలితాలు అంతగా కనిపించవు. శత్రువులను మిత్రులుగా మార్చే గుణం మీలో ఉంటుంది. కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవమున్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది. దూర ప్రాంతాల నుండి కొన్ని ఆహ్వానాల అన్నుతాయి. ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
మకరరాశి: ఉద్యోగంలో ఆలోచించి ముందుకు సాగాలి!
ఉద్యోగంలో ఆలోచించి ముందు సాగడం మంచిది. ఆకస్తిక ధన ప్రాస్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లభిస్తాయి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు పలుస్తాయి. చాలా సంతోషంగా ఉంటారు.
కుంభరాశి: ఉద్యమంలో అనుకూలత పెరుగుతుంది!
మృత్తి వ్యాపారాల్లో పరిస్థితులు అనుకూలంగా పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోదల కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండటమే మంచిది. వ్యాపార పెట్టుబడి విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. రుణదాతల నుండి ధన సహాయం అందుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
మీనరాశి: విభేదాల నుండి బయటపడతారు!
ఆత్మవిశ్వాసంతో విభేదాల నుండి బయటపడతారు. ఉద్యోగమున ధైర్యంగా నిర్ణయాలు చేస్తారు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ఆదాయం బాగుంటుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులను మధ్యలోనే నిలిపి వేయకూడదు. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.