Today Horoscope: నవంబర్ 26వ తేదీ శనివారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి!

ఆరోగ్య పట్ల ఈరోజు మీరు శ్రద్ధ వహించాలి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. కొన్ని దూరపు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. అనవసరంగా ఇతరుల మాటలు పట్టించుకోకండి. కొన్ని ప్రారంభించ పనుల్లో సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయాలి. సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృషభరాశి: అన్ని కార్యక్రమాల్లో విజయాలను సాధిస్తారు!

భూమికి సంబంధించిన విషయాలలో ఈరోజు మీరు విజయాలను సాధిస్తారు. కొంత డబ్బు పెట్టుబడిగా పెట్టాల్సి వస్తుంది. అనుకోని చోటు నుండి ఈరోజు ఆహ్వానాలు అందుతాయి. తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తలదూర్చడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇతరుల మాటలు మీ మనసుని నొప్పిస్తాయి.

మిధునరాశి: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు!

మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెట్టుబడి విషయాల్లో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువులను మిత్రులుగా మార్చే గుణం ఈరోజు మీలో ఉంటుంది. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.

కర్కాటక రాశి: పట్టుదలతో కొన్ని పనులను పూర్తి చేసుకోగలుగుతారు!

పట్టుదలతో ఈరోజు మీరు కొన్ని పనులను పూర్తి చేసుకోగలుగుతారు. ఆత్మీయుల నుండి సహకారం అందుతుంది. మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని దూరపు ప్రాణాలు ఈరోజు మీరు చేయాల్సి వస్తుంది. ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. బయట కొన్ని కొత్తగా పరిచయాలు ఏర్పడతాయి.

సింహరాశి: పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది!

కుటుంబంలో ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. పిల్లల పట్ల ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. విద్యార్థులు ఇతర వాటిపై కాకుండా మీ చదువుపై కూడా దృష్టి పెట్టాలి. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

కన్యరాశి: ఆరోగ్య బాధలు అధికమవుతాయి!

ఆరోగ్య బాధలు ఈరోజు అధికమిస్తాయి.
ఆ కారణంగా కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రారంభించే పనుల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది. వ్యాపార పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇతరులతో వాదనలకు దూరంగా ఉండడమే మంచిది.

తులరాశి: విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది!

మీరు చేసే ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవడం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఉద్యోగంలో అద్భుతమైన అవకాశాలను పొందుతారు. అనుకోని చోటు నుండి ఈరోజు మీకు డబ్బు చేతికి అందుతుంది.

వృశ్చికరాశి: నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు!

నూతన వస్తువులను బంగారు ఆభరణాలు ఈరోజు కొనుగోలు చేస్తారు. బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది. మీ కోపాన్ని ఈరోజు అదుపులో ఉంచుకోవడమే మంచిది.

ధనుస్సురాశి: ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు ఉంటాయి!

ప్రారంభించి పనులను చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు ఉంటాయి. మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చిస్తారు. వాహనం కొనుగోలు చేయాలనే కోరిక ఈరోజుతో నెరవేరుతుంది. మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజుతో కుదుటపడుతుంది. ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచె జరుగుతుంది.

మకరరాశి: ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు!

ప్రారంభించిన పనుల్లో ఆశించిన ఫలితాలు ఉండవు. స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అనవసరంగా డబ్బులే ఎక్కువ ఖర్చు చేస్తారు. తిరిగి సంపాదించే స్తోమత ఉంటుంది. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుంభరాశి: విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉంటారు!

విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. అనవసరంగా ఇతరుల విషయాల్లో మీరు జోక్యం చేసుకోకూడదు. మీరు చేసే పనుల్లో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకూడదు. శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.

మీనరాశి: ఆలోచనలు ఎక్కువగా చేస్తారు!

అనవసరమైన విషయాల గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. మీ విలువైన సమయాన్ని ఈరోజు అనవసరంగా వృధా చేయకండి. కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది. కొన్ని విలువైన బహుమతులను ఈరోజు మీరు కొనుగోలు చేస్తారు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమంలో ఈరోజు మీరు పాల్గొంటారు. భవిష్యత్తులో పెట్టుబడుల నుండి లాభాలను అందుకుంటారు.