Today Horoscope: నవంబర్ 19వ తేదీ శనివారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: ప్రారంభించబోయే పనుల్లో బద్దకాన్ని విడవాలి!

బంధుమిత్రులతో ఈరోజు విభేదాలు రావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. ప్రారంభించబోయే పనుల్లో బద్దకాన్ని విడవాలి. తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

వృషభరాశి: ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది!

దూర ప్రాంతాల నుండి ఈరోజు మీరు ఒక శుభవార్త వింటారు. అది మీ మనసుకి ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయాలి.

మిధునరాశి: సలహాలు తీసుకోవడం మంచిది!

కొన్ని సొంత నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు అవసరం. అనవసరంగా డబ్బులే ఎక్కువ ఖర్చు చేస్తారు. కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

కర్కాటక రాశి: విందు వినోదల కార్యక్రమాల్లో పాల్గొంటారు!

కొన్ని విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని దూరపు ప్రయాణాలు చేసే ముందు మీ ఆరోగ్యం పై మరింత శ్రద్ధ పెట్టాలి. కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.

సింహరాశి: కొన్ని పనులను వాయిదా వేసుకోవడం మంచిది!

ఒత్తిడితో కూడిన పనులను ఈరోజు మీరు వాయిదా వేసుకోవడం మంచిది. ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఆరోగ్యపరమైన విషయాలల్లో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఈరోజు విదేశాలు చదవాలనే ఆలోచనలో ఉంటారు.

కన్యరాశి: అనుకూలమైన సమయం ఉంటుంది!

ఉద్యోగ వ్యాపారాల్లో మీరు ఆశించే నిర్ణయాలు వస్తాయి. పై అధికారుల నుండి ఈరోజు మీరు మంచి బహుమతులను అందుకుంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని కొత్త పనులు నిర్వహించే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు.

తులరాశి: చేపట్టే పనుల్లో అడ్డంకులు ఎదుర్కొంటారు!

మీరు చేపట్టే పనిలో ఈరోజు కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు. ప్రారంభించబడిన పడుల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది. కుటుంబ సభ్యులతో ఈరోజు మీరు వాదనలకు దిగే అవకాశం ఉంది. ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

వృశ్చికరాశి: అనవసరంగా మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి!

అనవసరమైన విషయాల గురించి మీ సమయాన్ని వృధా చేయకండి. ఎప్పటినుండో వాహనం కొనుగోలు చేయాలనే మీ కోరిక ఈరోజు నెరవేరుతుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి ఈరోజు మీరు బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు. కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

ధనుస్సురాశి: అనవసరంగా ఇతరుల మనసును నొప్పిస్తారు!

మీ మాటలతో ఈరోజు అనవసరంగా ఇతరుల మనసును నొప్పిస్తారు. ఈరోజు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే మంచిది. ఈరోజు మీకు అంతా అనుకూలంగా ఉండదు. ప్రారంభించిన పనుల్లో చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఆవేశపూర్తిత నిర్ణయాలు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది.

మకరరాశి: ఖర్చులు ఎక్కువగా ఉంటాయి!

మీ కుటుంబంలో కొన్ని సమస్యల వలన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అనవసరంగా ఇతర వాటిపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది. భార్యాభర్తల మధ్యలో వాదనలు జరిగే అవకాశం ఉంది. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక వత్రికి గురై అవకాశం ఉంది.

కుంభరాశి: మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది!

మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎన్ని సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది. పై అధికారులతో ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. చాలా సంతోషంగా ఉంటారు.

మీనరాశి: సమస్యలు ఎక్కువగా ఉంటాయి!

శారీరక శ్రమ పెరుగుతుంది. ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇతర వారిపై కోపం ఈరోజు మీ కుటుంబ సభ్యులపై చూపిస్తారు. ఎన్ని మానసిక ఒత్తిడిలో ఉన్న మనోధైర్యంతో ముందుకు వెళ్తారు. మీ మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.