Today Horoscope: నవంబర్ 17వ తేదీ గురువారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: సంతానం నుండి మంచి శుభవార్త వింటారు!

కొన్ని దూరపు ప్రయాణాలు ఈరోజు మీరు వాయిదా వేసుకోవడమే మంచిది. మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

వృషభరాశి: గొప్ప అవకాశాలను పొందుతారు!

ఈరోజు విదేశాల నుండి గొప్ప అవకాశాలను పొందుతారు. మీరు ఏ పని మొదలు పెట్టిన ఈరోజు అంతా శుభమే జరుగుతుంది. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు. కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మిధునరాశి: అనుకున్న పనులు పూర్తవుతాయి!

కుటుంబ సభ్యుల సహాయంతో ఈరోజు మీరు కొన్ని కొన్ని పనుల్ని పూర్తి చేస్తారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఈరోజు ఆరోగ్యం కుదుటపడుతుంది. అనుకోని చోట నుండి ఈరోజు మీరు శుభవార్త వింటారు. అది మీ మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

కర్కాటక రాశి: ఉద్యోగంలో మంచి లాభాలను పొందుతారు!

మీరు చేసే ఉద్యోగంలో ఈరోజు మంచి లాభాలను పొందుతారు. సమాజంలో మంచి పలుకుబడి పెరుగుతుంది. ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందుమీ కుటుంబ సభ్యులతో చర్చలు చేయడం మంచిది. వ్యాపారానికి సంబంధించిన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

సింహరాశి: అదృష్టం కలిసి వస్తుంది!

గతంలో పెట్టుబడుల నుండి ఈరోజు మీరు మంచి లాభాలను పొందుతారు. మీరు ఈరోజు ఏ పని ప్రారంభించిన అదృష్ట పరంగా మీకు కలిసి వస్తుంది. ఎప్పటినుండో ఉన్న భూమి గొడవల నుండి ఈరోజు మీరు బయటపడతారు. ఇతరుల విషయాల్లో మీరు అనవసరంగా జోక్యం చేసుకోకపోవడం మంచిది.

కన్యరాశి: అనవసరమైన నిర్ణయాలు తీసుకోకండి.

మీరు ప్రారంభించిన పనుల్లో ఈరోజు తొందరపాటు తనం పనికిరావు. అనవసరంగా కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోవడం వలన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు. వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

తులరాశి: అధికారుల నుండి అభినందనలు పొందుతారు!

మీరు చేసే పనుల్లో పై అధికారుల నుండి అభినందనలు పొందుతారు. కొన్ని గొప్ప బహుమతులను ఈరోజు మీరు అందుకుంటారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలను పొందుతారు. తోటి వారితో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

వృశ్చికరాశి: చేసే పనుల్లో అలసట ఎక్కువగా ఉంటుంది!

మీరు చేసే పనుల్లో ఈరోజు అలసట ఎక్కువగా ఉంటుంది. అలసటకు తగ్గట్టుగా ఆదాయం కూడా పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. బయట అనుకోని పరిచయాలు ఈరోజు మీకు ఏర్పడతాయి.

ధనుస్సురాశి: పనిలో మార్పులు ఇబ్బంది పెడతాయి!

మీరు చేసే పనిలో ఈరోజు కొన్ని మార్పులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. గత కొద్ది రోజుల నుండి మీరు తీరిక లేని సమయంలో గడుపుతారు. కొందరి ముఖ్యమైన వ్యక్తులను ఈరోజు మీరు కలుస్తారు. వారితో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన అంతా మంచే జరుగుతుంది.

మకరరాశి: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు!

తోబుట్టులతో కలిసి ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు. కొన్ని బంగారు ఆభరణాలు ఈరోజు మీరు కొనుగోలు చేస్తారు. అనుకోని చోటు నుండి ఈరోజు మీకు డబ్బు చేతికి అందుతుంది. మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజుతో కుదుట పడుతుంది. చాలా సంతోషంగా ఉంటారు.

కుంభరాశి: స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు!

స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది. ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు. అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

మీనరాశి: వ్యవసాయపరంగా నష్టపోయే అవకాశం ఉంది!

మీరు చేసే వ్యవసాయంలో కొన్ని మార్పుల వలన నష్టపోయా అవకాశం ఉంది. కొందరి అనుభవమైన వ్యక్తులతో ఈరోజు మీరు చర్చలు చేయడమే మంచిది. మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి. కొన్ని చెడు అలవాట్లకు ఈరోజు మీరు చాలా దూరంగా ఉండడం మంచిది