మేషరాశి: ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయి!
ఈరోజు అనారోగ్య సమస్యతో సతమతమవుతారు. ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. బయట కొందరి కొత్త వ్యక్తుల పరిచాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకపోవడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు ఈరోజు మీకు పనికిరావు.
వృషభరాశి: దూర ప్రయాణం వాయిదా వేయాల్సి వస్తుంది!
ఈరోజు మీరు ప్రారంభించిన పనులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు. ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకపోవడమే మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మిధునరాశి: కుటుంబంలో కలహాలు మొదలవుతాయి!
పిల్లల పట్ల ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో కలహాలు మొదలవుతాయి. మీరు చేసే ఉద్యోగంలో కొన్ని ఆటంకాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారు ఈరోజు ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇతరులు చెప్పిన మాటలకు అనవసరంగా మోసపోకండి.
కర్కాటక రాశి: బంధుమిత్రులు కలుస్తారు!
కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ బంధుమిత్రులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు. సమాజంలో గౌర ప్రతిష్టాలను పొందుతారు. కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టుబడుల నుండి ఈరోజు మంచి లాభాలను పొందుతారు.
సింహరాశి: మానసిక ఆందోళనకు చెందుతారు!
మీరు ప్రారంభించిన పనులు చాలా నిదానంగా పూర్తి చేస్తారు. ఈరోజు మీలో ఆందోళన ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ప్రయత్నాలు చేస్తారు. సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది. చాలా సంతోషంగా ఉంటారు.
కన్యరాశి: ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకూడదు!
ఈరోజు కుటుంబంలో చికాకులే ఎదుర్కోవాల్సి వస్తుంది. బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. లేదంటే ఉన్న సమస్యల కంటే కొన్ని కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. ధైర్యంతో ముందుకు వెళ్తా అంతా మంచె జరుగుతుంది.
తులరాశి: అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి!
మీరు చేసే ఉద్యోగంలో కొద్దిపాటి సమస్యలు ఎదుర్కొంటారు. కోపంతో కాకుండా ప్రశాంతంగా మీ యొక్క సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. సంతానం పట్ల ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికరాశి: మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది!
మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది. ఏ పని ప్రారంభించినా చాలా నిదానంగా పూర్తి చేస్తారు. బయట మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడమే మంచిది. భూమికి సంబంధించిన పనులు ఈరోజు నెరవేరుతాయి. చాలా సంతోషంగా ఉంటారు.
ధనుస్సురాశి: అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి!
అనవసరమైన వస్తువులు ఈ రోజు కొనుగోలు చేస్తారు. మీరు చేసే ప్రయాణంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడమే మంచిది. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచె జరుగుతుంది.
మకరరాశి: ప్రారంభించిన పనిలో విశ్రాంతి!
ఈరోజు అనారోగ్య సమస్యతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని ప్రారంభించిన పనుల్లో విశ్రాంతి తీసుకోవడమే మంచిది. దగ్గరలో ఉన్న వైద్యుల్ని సంప్రదించాలి. ఈరోజు ఇతరుల మాటను మనసును నొప్పిస్తాయి. మానసిక ఆందోళన ఈ రోజు మీరు ఎక్కువగా ఉంటుంది. ధైర్యంతో ముందుకు వెళ్లాలి.
కుంభరాశి: అనవసరంగా సలహాలు ఇవ్వకూడదు!
ఈరోజు ఇతరులకు సలహాలు ఇవ్వడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనవసరంగా ఎదుటివారి విషయంలో తలదూర్చకుండా ఉండాలి. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల నా కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురవుతారు. కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండాలి.
మీనరాశి: వ్యవసాయదారులు లాభాలు పొందుతారు!
కుటుంబ సభ్యులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు. కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులు ఈరోజు భూమి కొనుగోలు చేస్తారు. ప్రారంభించిన పనుల్లో మీరు నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చ చేయడం మంచిది.