మేషరాశి: దీర్ఘ కాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది!
దీర్ఘ కాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగమున పని ఒత్తిడి పెరుగుతుంది తగిన విశ్రాంతి లభించదు. చేపట్టిన పనులు మందగోడిగా సాగుతాయి. ప్రయాణంలో మార్గ అవరోధాలు కలుగుతాయి. బంధుమిత్రుల వలన కొన్ని ఊహించని సమస్యలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి. శ్రమకు మించిన ప్రతిఫలం కనిపించదు.
వృషభరాశి: వృత్తి వ్యాపారాల్లో సమస్యలకు పరిష్కార దిశగా సాగుతుంది!
వ్యాపార సమస్యలకు పరిష్కార దిశగా సాగుతుంది. అకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు మొదలయ్యే అవకాశం ఉంది.
మిధునరాశి: ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు!
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. చేపట్టిన పనులు ఆప్రయత్నంగా పూర్తవుతాయి. లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమునకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అసాధ్యంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని దూర ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి.
కర్కాటక రాశి: ఉద్యోగంలో చికాకులు తప్పవు!
మీరు చేసే ఉద్యోగంలో చికాకులు తప్పవు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు. భూమికి సంబంధించిన విషయాల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిది. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాల అందుతాయి. మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
సింహరాశి: దూరపు ప్రయాణాలను వాయిదా వేస్తారు!
అనారోగ్య సమస్యతో సతమతమవుతారు. కొన్ని దూరపు ప్రయాణాలను వాయిదా వేస్తారు. అనవసరంగా మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి. విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలు ఉంటారు. మొండి బాకీలను వసూలు చేస్తారు. మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ప్రారంభించే పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు.
కన్యరాశి: సమాజంలో పలుకుబడి పెరుగుతుంది!
సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనుకోని చోటు నుండి ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఈరోజు ఆరోగ్యం కుదుటపడుతుంది.
తులరాశి: దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు!
కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో మంచి పలుకుబడి పెరుగుతుంది. ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది. ప్రారంభించే పనుల్లో ఆలోచనలు ఎంతో అవసరం. మీ మాటలతో ఇతరుల మనసును ఆకట్టుకుంటారు. స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.
వృశ్చికరాశి: నూతన వస్తువులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు!
ఏ పని ప్రారంభించిన అంతా మంచే జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాల గురించి చర్చలు చేస్తారు. నూతన వస్తువులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుండి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు అందుతాయి. కొన్ని దూరపు ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
ధనుస్సురాశి: కొన్ని వివాదాలు కలుగుతాయి!
వృత్తి వ్యాపారంలో ఆకారణ వివాదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకులుగా ఉంటుంది. దూరప్రాణాలు వాయిదా వేయడం మంచిది. తొందరపడి ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచనలు చేస్తారు.
మకరరాశి: అశ్రద్ధ చేయడం మంచిది కాదు!
ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు సకలంలో అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కీలక వ్యవహారాల్లో రెండు రకాలయిన ఆలోచనలతో ఇబ్బందులు తప్పవు. స్నేహితుల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
కుంభరాశి: ఉద్యోగంలో మార్పులు ఉంటాయి!
మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కొన్ని అదనపు బాధ్యతలను ఈరోజు మీరు పొందుతారు.
మీనరాశి: ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి!
ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా మీరు దృష్టి పెట్టాలి. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇతర వారిపై కోపం మీ కుటుంబ సభ్యులపై చూపిస్తారు. మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది. నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి