Today Horoscope: నవంబర్ 21వ తేదీ సోమవారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది!

మీరు చేసే ఉద్యోగంలో ఈరోజు కాస్త పని భారం పెరుగుతుంది. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. మీ మాటలతో ఇతరుల మనసును ఆకట్టుకుంటారు. ఆస్తికి సంబంధించిన విషయాలలో తోబుట్టువులతో వాదనలకు దిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృషభరాశి: సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి!

రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకోని కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు. కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

మిధునరాశి: మీ ఆదాయం పెరుగుతుంది!

మీరు చేసే వ్యాపారాల్లో ఈరోజు ఆదాయం పెరుగుతుంది. పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. తొందరపడి ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.

కర్కాటక రాశి: ఖర్చులు పెరిగే పరిస్థితులు ఏర్పడవచ్చు!

అనారోగ్య సమస్యతో ఈరోజు మీరు సతమతమవుతారు. కొన్ని ప్రారంభించిన పనులు ఈరోజు మీరు వాయిదా వేసుకోవడమే మంచిది. ఖర్చులు పెరిగే పరిస్థితులు ఏర్పడవచ్చు. అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు. వారితో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడమే మంచిది.

సింహరాశి: కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది!

వ్యాపారానికి సంబంధించిన విషయాలలో ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయం పనికిరావు. డబ్బును పెట్టుబడులుగా పెట్టే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాదనలు జరిగే అవకాశం ఉంది. దూర ప్రాంతాల నుండి అనుకోకుండా ఒక శుభవార్త వింటారు. అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

కన్యరాశి: ఈరోజు కాస్త కష్టపడాల్సి వస్తుంది!

ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ ఈరోజు మీరు పూర్తి చేయడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఎంతో అవసరం. మీ చిన్ననాటి స్నేహితులతో ఈరోజు మీరు బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు. అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయకూడదు.

తులరాశి: విద్యార్థులు చదువులో ఆటంకాలు ఎదుర్కొంటారు!

విద్యార్థులు ఈరోజు ఇతర వాటిపై కాకుండా మీ చదువుపై కూడా దృష్టి పెట్టాలి. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది. కొన్ని చెడు సావాసలకు దూరంగా ఉండాలి.

వృశ్చికరాశి: బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు!

ఈరోజు పిల్లలతో బయట సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. మీరు చేసే పనుల్లో ఆదాయం పెరుగుతుంది. ఇంటికి సంబంధించిన విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు. గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బులు నుండి ఈరోజు మంచి ఆదాయాన్ని పొందుతారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఈ రోజు ఆరోగ్యం కుదుటపడుతుంది.

ధనుస్సురాశి: ఏ పని చేసిన విజయాలను సాధిస్తారు!

ఈరోజు ఏ పని ప్రారంభించి నా మీరు మంచి విజయాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం చేసుకుంటారు. ప్రయాణం చేసినప్పుడు కొన్ని ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. అనుకోని చోటు నుండి శుభవార్తలు వింటారు.

మకరరాశి: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు!

నూతన వస్తువులను బంగారు ఆభరణాలు ఈ రోజు మీరు కొనుగోలు చేస్తారు. ఆలోచించి ఖర్చులు చేయడం మంచిది. కుటుంబ సభ్యులతో తరచూ వాదనలకు దిగే అవకాశం ఉంది. ఇతర వారిపై కోపం ఈరోజు మీ కుటుంబ సభ్యులపై చూపిస్తారు. అనవసరంగా ఎదుటి వారి మనసు బాధ పెడతారు.

కుంభరాశి: ఏ పని నైనా చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు!

బలహీనత ఈరోజు మీలో ఎక్కువగా ఉంటుంది. ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు. మీ సొంత నిర్ణయాలు వలన ఈరోజు కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కొన్ని చెడు అలవాట్లకి ఈరోజు మీరు దూరంగా ఉండటమే మంచిది. బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మీనరాశి: ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి!

కుటుంబ సభ్యులతో ఈరోజు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది. శత్రువులను మిత్రులుగా మార్చే గుణం ఈరోజు మీలో ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.