Today Horoscope: నవంబర్ 14వ తేదీ సోమవారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: ఉద్యోగంలో జాగ్రత్తలు అవసరం!

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో మార్పుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు. పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలను పొందుతారు. కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు అవసరం.

వృషభరాశి: దూరపు ప్రాణాలు వాయిదా వేసుకోవాలి!

అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి
ఈరోజు ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది. తొందరపాటు నిర్ణయాలు ఈరోజు మీకు పనికిరావు. మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు. వారితో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకపోవడమే మంచిది.

మిధునరాశి: శత్రువులకు దూరంగా ఉండాలి!

మీరంటే గిట్టని వారు మీ విషయాలు తలదూరుస్తారు. అనవసరంగా ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి. శత్రువులకు ఈరోజు దూరంగా ఉండటమే మంచిది. మీరు చేసే పొరపాట్ల వలన కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంది. బయట ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది.

కర్కాటక రాశి: మంచి లాభాలను పొందుతారు!

మీరు చేసే వ్యాపారంలో ఈరోజు మంచి లాభాలను పొందుతారు. మీ మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు. కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. శత్రువులను మిత్రులుగా మార్చే గుణం ఈరోజు మీలో ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటారు.

సింహరాశి: నిరుద్యోగులు ఉద్యోగం పొందుతారు !

నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ అవకాశం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. బయట అప్పు తీర్చాలని ఆలోచనలో ఉంటారు. సమయానికి అనుకొని చోటు నుండి డబ్బు చేతు అందుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తా అంతా మంచే జరుగుతుంది.

కన్యరాశి: చదువు పట్ల దృష్టి పెట్టాలి!

మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చ చేస్తారు. ఇతర పనులపై కాకుండా మీరు మీ చదువుపై కూడా దృష్టి పెట్టడం మంచిది. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఈ రోజు ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది.

తులరాశి: అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మంచిది!

స్నేహితులతో కలిసి బయటి సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడమే మంచిది. కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది. ప్రారంభించిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది.

వృశ్చికరాశి: కుటుంబంలో సమస్యలు మొదలవుతాయి!

ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకపోవడమే మంచిది. కుటుంబంలో కొన్ని సమస్యలు మొదలవుతాయి. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది. అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.

ధనుస్సురాశి: ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు!

మీరు చేసే ఉద్యోగంలో ఈరోజు మంచి లాభాలను అందుకుంటారు. కొన్ని ఆర్థిక సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు. ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన అంతా శుభమే జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంటారు.

మకరరాశి: వ్యవసాయదారులు నష్టపోతారు!

మీరు చేసే వ్యవసాయంలో కొన్ని మార్పుల వలన నష్టపోయే అవకాశం ఉంది. అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు. మీ మాటలతో ఇతరుల మనసును నొప్పిస్తారు. తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

కుంభరాశి: శుభకార్యాలలో పాల్గొంటారు!

కొన్ని శుభకార్యాలలో ఈరోజు మీరు పాల్గొంటారు. కొన్ని కొత్త పరిచయాలు కూడా ఈరోజు మీకు ఏర్పడతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇతరులతో చర్చలు చేస్తారు. చాలా ఉత్సాహంగా ఉంటారు.

మీనరాశి: వాయిదా పడ్డ పనులు పూర్తి చేస్తారు!

ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ ఈరోజు స్నేహితుల సహాయంతో పూర్తిచేస్తారు. వాహనం కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది. ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.