Today Horoscope: జనవరి 9వ తేదీ సోమవారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: చేపట్టిన పనులు వాయిదా పడతాయి!

చేపట్టిన పనులు వాయిదా పడతాయి. బంధు వర్గంతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట ఊహించని సమస్యలు కలుగుతాయి. భూమికి సంబంధించిన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు. మీరంటే గిట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృషభరాశి: నిరుద్యోగుల యత్నాలు సఫలం అవుతాయి!

నిరుద్యోగుల యత్నాలు సఫలం అవుతాయి. మిత్రులతో విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో మరింత అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనవస్తు లాభాలు పొందుతారు. గతంలో పెట్టుబడుల నుంచి మంచి లాభాలను అందుకుంటారు. కొన్ని దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

మిధునరాశి: చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి!

చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఒక వ్యవహారాల్లో మాట పట్టింపులు తప్పవు. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహ పరిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకపోవడమే మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

కర్కాటక రాశి: వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి!

వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ధరలతో పంచుకోకపోవడమే మంచిది.

సింహరాశి: వ్యాపార ఉద్యోగాల్లో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి!

వ్యాపార ఉద్యోగాల్లో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిపాటి ఆటంకాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వైద్యుని సంప్రదించడం మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కన్యరాశి: కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు!

కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నూతన ఉత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నూతన గృహ వాహనం యోగం ఉన్నది. విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్థాయి. మీ చిన్ననాటి స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

తులరాశి: వ్యాపార ఉద్యోగాలు అనుకూల వాతావరణం ఉంటుంది!

వ్యాపార ఉద్యోగాల్లో అనుకూల వాతావరణ ఉంటుంది. దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. రాజకీయ ప్రముఖుల నుండి సమావేశాలలో ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంటారు.

వృశ్చికరాశి: ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు!

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో అధికారుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. తరచు మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.

ధనుస్సురాశి: ప్రారంభించిన పనులను చాలా త్వరగా పూర్తి చేస్తారు!

ప్రారంభించిన పనులను చాలా త్వరగా పూర్తి చేశారు. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. అనుకోని చోటు నుండి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని దూరప్రాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.

మకరరాశి: వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు పలుస్తాయి!

వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు పలుస్తాయి. సంఘంలో పేరు కలిగిన వ్యక్తితో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. విద్యార్థులు కష్టం ఫలిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.

కుంభరాశి: వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలు తొలుగుతాయి!

వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలు తొలుగుతాయి. చాలా కాలంగా పూర్తికాని పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదల కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. సంతాన విద్య ఉద్యోగ విషయాల శుభవార్తలు అందుతాయి. ఇతరుల నుండి మీ సొమ్ము రావడం ఆలస్యం అవుతుంది. ధైర్యంతో ముందుకు వెళ్లాలి

మీనరాశి: పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు!

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు మందకోడిగాసాగుతాయి. ఉద్యోగాల్లో
సహోఉద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు