Today Horoscope: జనవరి 3వ తేదీ మంగళవారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం!

ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ముఖ్యమైన పనులను వాయిదా వేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి. దూరపు బంధువుల నుండి ఒక శుభవార్త అందుతుంది. అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృషభరాశి: నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు!

నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. స్నేహితులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరుల నుండి మీ సొమ్ము రావడం ఆలస్యం అవుతుంది. మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండటమే మంచిది.

మిధునరాశి: మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు!

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ఎప్పటి నుండో వాయిదా పడ్డ పనులన్నీ ఇతరుల సహాయంతో పూర్తి చేస్తారు. భూమికి సంబంధించిన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు. మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. శత్రువులకు దూరంగా ఉండాలి.

కర్కాటక రాశి: మీరు చేసే పనుల్లో కొన్ని మార్పులను ఎదుర్కొంటారు!

మీరు చేసే పనిలో కొన్ని మార్పులను ఎదుర్కొంటారు. గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వలన మీకు మనశ్శాంతి ఉండదు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది. తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన సమస్యలను ఎదుర్కొంటారు. ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

సింహరాశి: తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు!

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకొని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. వ్యాపారానికి సంబంధించిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది. కొన్ని దూరపు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. బయట ఊహించిన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

కన్యరాశి: ప్రారంభించిన పనులను చాలా త్వరగా పూర్తి చేస్తారు!

ప్రారంభించిన పనులను చాలా త్వరగా పూర్తి చేస్తారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలను పొందుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. మీ కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

తులరాశి: సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి!

సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు చేసే పడులో కొన్ని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. దూరపు ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది. అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు. వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

వృశ్చికరాశి: నూతన వాహనం కొనుగోలు చేస్తారు!

నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. స్నేహితులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణం చేస్తారు. నిరుద్యోలకు ఉద్యోగ అవకాశం ఉంటుంది. కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

ధనుస్సురాశి: మీరు చేసే ఉద్యోగం శ్రమకు తగిన ఫలితం కనిపించదు!

మీరు చేసే ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలం కనిపించదు. గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు. అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడతారు. కొన్ని ప్రారంభించిన పనులను వాయిదా వేయడం మంచిది. బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతి కందుతుంది. అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకపోవడమే మంచిది. మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు

మకరరాశి: వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి!

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనులు సకలంలో పూర్తవుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. కొన్ని దూరపు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.

కుంభరాశి: ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది!

ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నిరోత్సాహపరుస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. గృహం నిర్మాణ ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు తప్పవు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మీనరాశి: ఆస్తి వివాదాలు తొలుగుతాయి!

ఆస్తి వివాదాలు తొలుగుతాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కీలక సమయాల్లో ఆత్మీయుల సలహాలు సేకరిస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో మరింత అనుకూలంగా సాగుతాయి. బంధుమిత్రులతో పట్టింపులు కలుగుతాయి. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం ఉండదు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.