Today Horoscope: జనవరి 30వ తేదీ సోమవారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది!

కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. వ్యాపారానికి సంబంధించిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొందరు ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడి మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి.

వృషభరాశి: తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి!

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది. కొందరు ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడిన మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మిధునరాశి: అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తవుతాయి!

అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తవుతాయి. మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది. కుటుంబ సభ్యులతో వాదనాలకు దిగే అవకాశం ఉంది. మీ మాటలతో ఇతరుల మనసుని పెడతారు. తరచూ తరచు మీ నిర్ణయాలను మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.

కర్కాటక రాశి: నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం!

నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి. మిత్రుల శత్రువులుగా మారే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. కొన్ని దూర ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి.

సింహరాశి: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది!

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. మీ పాత స్నేహితులను కలుసుకుంటారు. బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అంటుతుంది. అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది.

కన్యరాశి: ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి!

ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది. అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు. వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది. అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు. మీ సోదరులతో భూమికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతారు.

తులరాశి: ఆర్థికంగా లాభాలను అందుకుంటారు!

ఆర్థికంగా లాభాలను అందుకుంటారు. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. మీ జీవిత భాగస్వామితో కలిసిబయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు. ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. లేదంటే కొన్ని ప్రమాదాలను ఎదుర్కొంటారు.

వృశ్చికరాశి: మానసిక బలహీనత ఎక్కువగా ఉంటుంది!

మీలో మానసిక బలహీనత ఎక్కువగా ఉంటుంది. ప్రారంభించిన పనులను చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు. మీ కుటుంబ సభ్యులతో వాదనాలకు దిగే అవకాశం ఉంది. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది. మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

ధనుస్సురాశి: వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి!

వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు. ఇతరులు చెప్పిన మాటలకు అనవసరంగా మోసపోకండి. కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలను
పొందుతారు. కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

మకరరాశి: మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది!

మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకొని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ఇతరుల నుండి సమస్యలు తప్పవు. నూతన రుణాలు చేస్తారు. వృధా ప్రయాణాల సూచనలు ఉన్నవి. ఉద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి. దైవ చింతని పెరుగుతుంది.

కుంభరాశి: విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు!

విలువైన వస్తువు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల్లో అంతా మంచే జరుగుతుంది.

మీనరాశి: ఉద్యోగస్తులకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది!

ఉద్యోగస్తులకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. దైవసేవ కార్యక్రమాలు పాల్గొంటారు. చేపట్టిన పనులు సాధారణంగా సాగుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.