మేషరాశి: సంతానం వ్యాపారాలు సజావుగా సాగుతాయి!
సంతానం వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
వృషభరాశి: వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి!
వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. బంధువులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. భూమికి సంబంధించిన విషయాల్లో మీరు తల దూర్చకుండా ఉండడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
మిధునరాశి: నూతన వాహన యోగం ఉన్నది!
నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. గృహమున బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొన్ని దూర ప్రాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.మీరంటే గిద్దనివారం విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
కర్కాటకరాశి: వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి!
వ్యాపారాలు సాటిగా సాగుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అకస్మిక ధన లాభ సూచనలున్నవి. ఇంటికి సంబంధించిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చాలా సంతోషంగా ఉంటారు.
సింహరాశి: అనారోగ్య సమస్యలు బాధిస్తాయి!
అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణాలు చేస్తారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపార ఉద్యోగాల్లో చికాకు తప్పవు. కుటుంబ వ్యవహారాల సొంత ఆలోచనలు కలిసి రావు. బంధువులతో ఆకస్మిక తగాదాలు ఉంటాయి. మీరంటే గిట్టన్నారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. తరచూ మార్చుకునే మీ నిర్ణయాలా వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
కన్యరాశి: నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు!
నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొన్ని దూర ప్రాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది. మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడమని మంచిది.
తులరాశి: ఉద్యోగమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు!
ఉద్యోగమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉరవ బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగుపడతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు పలుస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా కొత్త డబ్బు ఖర్చవుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.
వృశ్చికరాశి: దైవ సేవ కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు!
దైవ సేవ కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. ఎంతో బయట అనుకూల వాతావరణ ఉంటుంది. వ్యాపారాలు విస్తరిస్తాయి. అప్పుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. స్నేహితుల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ధైర్యంతో ముందుకు వెళ్లాలి.
ధనుస్సురాశి: చేపట్టే పనిలో శ్రమ పెరుగుతుంది!
చేపట్టిన పనులు శ్రమ పెరుగుతుంది.వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరిస్తాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ప్రారంభించబడలో కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు అంతా మంచే జరుగుతుంది.
మకరరాశి: ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి!
ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఉద్యోగాల అధికారుల నుండి విమర్శలు తప్పవు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వ్యాపారాలు శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.
కుంభరాశి: వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి!
వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోలకు నూతన ఉద్యోగ అవకాశంలో లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని దూరప్రాయాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
మీనరాశి: వృత్తి వ్యాపారాల్లో శ్రమదిక్యత పెరుగుతుంది!
వృత్తి వ్యాపారాల్లో శ్రమదిక్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు సూచనలున్నవి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. మీ చిన్ననాటి బంధువులను కలుసుకుంటారు. వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు