మేషరాశి: ఇంటా బయట బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు!
ఇంటా బయట బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కొన్ని పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు. తొందరపడి మీ వ్యక్తిగత విషయాలని ఇతరులతో పంచుకోకండి. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.
వృషభరాశి: చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది!
చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. సోదరుల నుంచి ధన సహాయం పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో మీ విలువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
మిధునరాశి: దూర ప్రాంతాల నుంచి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది
దూర ప్రాంతాల నుంచి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. గృహ నిర్మాణ ఆలోచనలు సాధారణంగా సాగుతాయి. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్నేహితులని కలుసుకొని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వారితో చర్చలు చేస్తారు. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధైర్యంతో ముందుకు వెళ్తా అంతా మంచే జరుగుతుంది.
కర్కాటక రాశి: బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి
బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పడ్డ ఫలితం కనిపించదు. వాహన కొనుగోలు ప్రయత్నాలు పలుస్తాయి. గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. వ్యాపారస్తులు నూతన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది. ఆత్మవిశ్వాసం తమ ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
సింహరాశి: ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది!
ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంతాన విద్య విషయాల్లో శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.
కన్యరాశి: చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు!
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు పలుస్తాయి. ఊహించని విధంగా అప్పులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది. మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
తులరాశి: సన్నిహితుల నుంచి శుభవార్తల అందుతాయి!
సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంత అనుకూలంగా ఉంది.
వృశ్చికరాశి: చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు!
చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంతాల బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. భూమికి సంబంధించిన విషయాలలో మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
ధనుస్సురాశి: చేపట్టిన వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు!
చేపట్టిన వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. అకస్మిక ధన లాభ సూచనలున్నవి. ఉద్యోగమున అధికారులతో సమస్యలు రాజీ చేసుకుంటారు. సోదరులతో భూవిదనాలు తీరి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సోదరులతో పాత విషయాలు చర్చిస్తారు. ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
మకరరాశి: నూతన వాహనం కొనుగోలు చేస్తారు!
నూతన వాహనం కొనుగోలు చేస్తారు. మీ కుటుంబ సభ్యులకు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. తొందరపడిన వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకండి. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోలకు ఉద్యోగ ఉద్యోగ అవకాశం ఉంటుంది. కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కుంభరాశి: అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు!
అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాల స్వల్ప లాభాలు పొందుతారు. బంధుమిత్రుల సహాయం సహకారాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రుణ దాతల ఒత్తిడి తొలగుతుంది. దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
మీనరాశి: సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది!
సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన వ్యక్తుల పరిచయాలు సంతోషాన్ని స్థాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. గృహ నిర్మాణ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. చాలా ఉత్సాహంగా ఉంటారు.