Today Horoscope: జనవరి17వ తేదీ మంగళవారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు పలిస్తాయి!

సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు పలిస్తాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. అధికారులతో చర్చలకు అనుకూల సమయం. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

వృషభరాశి: సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి!

సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి.చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. ఇతరుల నుండి మీ సొమ్ము వసూలు అవుతుంది. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. చాలా సంతోషంగా ఉంటారు.

మిధునరాశి: ఆరోగ్య విషయాలు జాగ్రత్త అవసరం!

ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. సన్నిహితులతో వివాదాలు దూరంగా ఉండటం మంచిది. ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

కర్కాటకరాశి: బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి!

బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు స్వల్పంగా లభిస్తాయి. ఉద్యోగమున కొన్ని బాధ్యతలను పొందుతారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కొందరు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. వారితో కొన్ని చర్చలు చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ కుటుంబ సభ్యులతో చర్చలు చేయడం మంచిది. ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

సింహరాశి: గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి!

గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం ఉన్నది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు పలిస్తాయి. ఉద్యోగులకుహోదా పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

కన్యరాశి: చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి!

చేపట్టిన పనులను దానంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. తొందరపడి మీ వ్యక్తిగత విషయాలని తరులతో పంచుకోకపోవడమే మంచిది. అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు. మీరంటే గిట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

తులరాశి: వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు!

వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు. తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. ప్రారంభించిన పనులను చాలా త్వరగా పూర్తి చేస్తారు.

వృశ్చికరాశి: కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది!

కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి. తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు చేసే పనుల్లో కొన్ని మార్పుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరుల మాటలు మీ మనసును నొప్పిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

ధనుస్సురాశి: మానసిక బలహీనత ఎక్కువగా ఉంటుంది!

మానసిక బలహీనతఎక్కువగా ఉంటుంది. ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండాలి. నూతన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవమున్న వ్యక్తులతో చర్చ చేయడం మంచిది.

మకరరాశి: ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి!

ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలను తొందరపడి ఇతరులతో పంచుకోకండి. కొన్ని దూర ప్రయాణాలు చేసే ముందు నూతన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీరంటే గిట్టని వారు మీ విషయంలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది. మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

కుంభరాశి: ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవడం మంచిది!

ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవడం మంచిది. కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయాలి. తరచు మార్చుకునే మిన్నెల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇతరుల నుండి మిస్సమ్మ తిరిగి రావడం ఆలస్యం అవుతుంది. అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

మీనరాశి: అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు!

స్నేహితుల సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి.