Today Horoscope: జనవరి 15వ తేదీ ఆదివారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు!

కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. బయట కొందరి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకునే ముందు ఆలోచన ఎంతో అవసరం. భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

వృషభరాశి: వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి!

వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులు తొందరపాటు మంచిది కాదు. దైవదర్శనాలు చేసుకుంటారు. ధనవహారాల్లో జాగ్రత్త అవసరం. సంతన ఆరోగ్య విషయాలు జాగ్రత్త అవసరం. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

మిధునరాశి: బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి!

బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. మీరంటే గిట్టనివారు విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. భూమికి సంబంధించిన విషయాలు మీరు తల దూర్చకుండా ఉండడమే మంచిది. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.

కర్కాటక రాశి: పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి!

పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది. అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. మీరు చేసే ఉద్యమంలో కొన్ని మార్పుల వలన సమస్యలను ఎదుర్కొంటారు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చ చేస్తారు.

సింహరాశి: మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది!

మిత్రుల శత్రువులుగా మారే అవకాశం ఉంది. భూమికి సంబంధించిన విషయాల్లో ఇతరులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని దూరపు ప్రయాణాలు చేసేవారు విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది. ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి.

కన్యరాశి: అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది!

అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. గృహ సంబంధించిన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. బయట కొందరి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.

తులరాశి: కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు!

కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంత అనుకూలంగా ఉంది. ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకునే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మీ చిన్ననాటి స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేశారు. అధికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది.

వృశ్చికరాశి: వ్యాపారానికి సంబంధించిన విషయాలు చర్చలు చేస్తున్నారు!

వ్యాపారానికి సంబంధించిన విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు. కొన్ని దూరప్రాణాలు చేసే ముందు ఆలోచనలు ఎంత అవసరం. గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వలనవిశ్రాంతి దొరకదు. మీ చిన్ననాటి స్నేహితులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. వ్యాపారానికి సంబంధించిననూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

ధనుస్సురాశి: ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులను పూర్తి చేస్తారు!

ఎప్పటి నుండో వాయిదా పడ్డ పనులను స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. ప్రయాణం చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. తరచు మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇతరులతో తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

మకరరాశి: వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు!

వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల్లో అంత మంచి జరుగుతుంది. ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది. బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కుంభరాశి: కుటుంబమునకు ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటారు!

కుటుంబమునకు ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషాన్ని స్థాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకలంలో చేతికందుతుంది. బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వారితో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.

మీనరాశి: సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి!

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అసాధ్యంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. ధన్యవాదాలు కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంత అవసరం