Today Horoscope: జనవరి 14వ తేదీ శనివారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: గతంలో నిలిపి వేయబడ్డ పనులు పూర్తి చేస్తారు!

గతంలో నిలిపి వేయబడ్డ పనులను పనులను పూర్తి చేస్తారు. కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. తొందరపడి మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

వృషభరాశి: అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు!

అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది. మీ సోదరులతో భూమికి సంబంధించిన విషయాల గురించి చర్చలు చేస్తారు. ఇతరుల విషయాల్లో మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడి విశాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చ చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తా అంతా మంచే జరుగుతుంది.

మిధునరాశి: దూర ప్రయాణాలను వాయిదా వేయాలి,!

దూర ప్రయాణాలను వాయిదా వేయాలి. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. మీ కుటుంబతో కలిసి విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

కర్కాటక రాశి: కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు!

కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది. ఇతరుల మాటలు మీ మనసును బాధిస్తాయి. ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

సింహరాశి: ప్రారంభించిన పనులను చాలా నిదానంగా పూర్తి చేస్తారు!

ప్రారంభించిన పనులను చాలా నిదానంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో వాదనాలకు దిగే అవకాశం ఉంది. తరచూ మార్చుకునే నిర్ణయాల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. కొన్ని చెడు సవాసాలకు దూరంగా ఉండాలి. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది.

కన్యరాశి: నూతన వాహనం కొనుగోలు చేస్తారు!

నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఇతరుల బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా సమయానికి మీ చేతికి అందుతుంది. చాలా కాలంగా నిలిపివేయబడ్డ పనులను స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. మీ కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా సంతోషంగా ఉంటారు.

తులరాశి: బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మీరంటే గిట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వృత్తి వ్యాపారాలు అనుకూల వాతావరణం ఉండదు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

వృశ్చికరాశి: ఇంటికి సంబంధించిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు!

ఇంటికి సంబంధించిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని దూర చేయడానికి మీకు ఎంత అనుకూలంగా ఉంది. ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకునే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

ధనుస్సురాశి: ఉద్యోగంలో కొన్ని మార్పులను ఎదుర్కొంటారు!

ఉద్యోగంలో కొన్ని మార్పులను ఎదుర్కొంటారు. గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వలన విశ్రాంతి దొరకదు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసికొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరుల విషయాల్లో మీరు జోక్యం చేసుకోకపోవడం మంచిది.

మకరరాశి: మీరు చేసే ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది!

మీరు చేసే ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను చాలా త్వరగా పూర్తి చేస్తారు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది. దగ్గర్లో ఉన్న వైద్యుని సంప్రదించాలి.

కుంభరాశి: వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి!

వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. దైవ చింతన పెరుగుతుంది. కొన్ని దూర ప్రయాణాలు చేసే ముందు విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రయాణంలో మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.

మీనరాశి: మీరు చేసే ఉద్యోగంలో అదనపు బాధ్యతలను పొందుతారు!

మీరు చేసే ఉద్యోగంలో అదనపు బాధ్యతలను పొందుతారు. కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. కొందరు గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తవుతాయి. చాలా ఉత్సాహంగా ఉంటారు.