మేషరాశి: అనుకున్న వ్యవహారాలు ముందు సాగవు!
ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు అవసరం. మీరు చేసే ఉద్యోగంలో మార్పులు వస్తాయి. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ఈరోజు మీరు అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు సతమతం చేస్తాయి.
వృషభరాశి: సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది!
మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది. పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా ఈరోజు దృష్టి పెట్టాలి. అనుకోని చోటు నుండి ఈరోజు మీకు ఆహ్వానాలు అందుతాయి. దూరపు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మిధునరాశి: ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది!
చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇతరుల విషయాల్లో ఈరోజు మీరు జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తవుతుంది. కొన్ని గొప్ప బహుమతులను ఈరోజు మీరు కొనుగోలు చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.
కర్కాటక రాశి: వాహనయోగం ఉంది!
విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వాహనయోగం ఉంది. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది. ప్రారంభించే పనుల్లో ఈరోజు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
సింహరాశి: వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది!
మీరు చేసే ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. మీ మాటలు ఇతరుల మనసుని నొప్పిస్తాయి. భూమికి సంబంధించిన విషయాలలో ఈరోజు కొన్ని వాదనలు జరిగే అవకాశం ఉంది. పెట్టుబడి విషయాల్లో ఈరోజు మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. తోపుట్టులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కన్యరాశి: వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి!
ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. ప్రారంభించిన పనులను మధ్యలోనే వాయిదా వేస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. బయట అప్పుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం చేస్తారు. కొన్ని చెడు అలవాట్లకి ఈరోజు మీరు దూరంగా ఉండడం మంచిది.
తులరాశి: కుటుంబంలో చికాకులు కలుగుతాయి!
కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మానసిక చికాకులు కలుగుతాయి. మీరు చేసే వ్యాపారంలో ఉద్యోగంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. బంధువులతో వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు. పొరపాటున కూడా మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.
వృశ్చికరాశి: కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి!
ఈరోజు ఇతరుల విషయాల్లో మీరు జోక్యం చేసుకోకూడదు. ఇతర వారిపై కోపం మీ కుటుంబ సభ్యులపై చూపిస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. దైవదర్శనాలు ఈరోజు మీ మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.
ధనుస్సురాశి: విభేదాలకు దూరంగా ఉండటం మంచిది!
ఆరోగ్య సమస్యలు ఈరోజు మిమ్మల్ని బాధిస్తాయి. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు. ఉద్యోగస్తులకు అదనపు అధికారం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపార పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులను మళ్లీ ప్రారంభిస్తారు. అనుకోని చోటు నుండి డబ్బు చేతి అందుతుంది.
మకరరాశి: సంతానం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి!
కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. సంతానం ఆరోగ్యా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తలదూర్చడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగంలో కొన్ని బాధ్యతలు పెరుగుతాయి.
కుంభరాశి: కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది!
వ్యాపారానికి నూతన పెట్టుబడులు అందుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. కొన్ని సమస్యల నుండి ఈరోజు బయటపడతారు. ఉద్యోగంలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంది.
మీనరాశి: ధన వ్యవహారాలు అసాధ్యంగా ఉంటాయి!
ఉద్యోగస్తులు అధికారుల అనుగ్రహంతో అనుకున్న మార్పులు చోటు చేసుకుంటారు. స్థలం కొనుగోలు ప్రయత్నాలు పాలిస్తాయి. సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. కొంత డబ్బు పెట్టుబడిగా పెట్టాల్సి వస్తుంది. అనవసరంగా ఇతరులు చెప్పిన మాటలకు ఈరోజు మీరు మోసపోకండి. బయట వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.