Today Horoscope: డిసెంబర్ 23వ తేదీ శుక్రవారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది!

ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలు స్వల్ప అవాంతరాలు తప్పవు. ఉద్యోగాల్లో స్థానచలన ఉన్నవి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడమే మంచిది. అనుకోని చోటు నుండి ఆహ్వానాలు అందుతాయి.

వృషభరాశి: వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి!

వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాల్లో పని ఒత్తిడి మరింత పెరుగుతుంది. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. అవసరానికి చేతికి ధనం అందుకు ఇబ్బంది పడతారు. సంతానం విద్య ఉద్యోగ యాత్నాలు మందగిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.

మిధునరాశి: వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి!

వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. గౌరవ మర్యాదలకు లోటుండదు. కొందరు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. వారితో వ్యాపారానికి సంబంధించిన విషయాల గురించి చర్చలు చేస్తారు. కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది.

కర్కాటక రాశి: నూతన వాహనం కొనుగోలు చేస్తారు!

నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాల అధికారులతో చర్చలు సఫలమవుతాయి. వ్యాపార విస్తరణకు కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో దైవ క్షేత్రాలు దర్శించుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.

సింహరాశి: ఒప్పందాలు వాయిదా పడతాయి!

ఒప్పందాలు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగమున ఊహించిన సమస్యలు ఎదురవుతాయి. సన్నిహితులతో వివాదాలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పడ్డ ఫలితం కనిపించదు. మీ చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకొని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. చాలా సంతోషంగా ఉంటారు.

కన్యరాశి: నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు!

నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. తరచూ మార్చుకునే మీరు నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ తోబుట్టువులను కలుసుకొని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వారితో చర్చలు చేస్తారు.

తులరాశి: దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి!

దూర ప్రాంతాల నుండి ఆహ్వానాల అందుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో కలిసికొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. కొందరి ముఖ్యమైన వ్యక్తితో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది. కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

వృశ్చికరాశి: స్నేహితుల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు!

స్నేహితుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది. ఇతర పనులపై కాకుండా మీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి. ఆర్థికంగా కొన్ని డబ్బులు ఖర్చు చేస్తారు. ఎదుటి వారిపై కోపం మీ కుటుంబ సభ్యులపై చూపిస్తారు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే మంచిది.

ధనుస్సురాశి: ప్రారంభించిన పనులను త్వరగా పూర్తి చేస్తారు!

ప్రారంభించిన పనులను త్వరగా పూర్తి చేస్తారు. సమాజంలో మంచి పలుకుబడి పెరుగుతుంది. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంత అనుకూలంగా ఉంది. ఇతరుల నుండి ధన సహాయం అందుతుంది. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంత అనుకూలంగా ఉంది.

మకరరాశి: అనారోగ్య సమస్య చికాకు పరుస్తుంది!

అనారోగ్య సమస్య చికాకు పరుస్తుంది. ప్రారంభించిన పనులను వాయిదా వేయడమే మంచిది. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు. గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. సభ్యులకు దూరంగా ఉండడం మంచిది..

కుంభరాశి: భూమికి సంబంధించిన విషయాల్లో తలదూర్చకుండా ఉండండి!

భూమికి సంబంధించిన విషయాల్లో తలదూర్చకుండా ఉండడమే మంచిది. కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు. మీరు ప్రారంభించిన పనుల్లో అంతా మంచే జరుగుతుంది. విద్యార్థులు విదేశీ ప్రయాణాలు చేయాలనే ఆలోచనలో ఉంటారు. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. బయట ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

మీనరాశి: ఆరోగ్యం కుదుటపడుతుంది!

మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు. వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. కుటుంబ సభ్యులు అంతా కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు. ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది.చాలా ఉత్సాహంగా ఉంటారు.