Today Horoscope: జనవరి 20వ తేదీ శుక్రవారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు!

నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి. అనుకోని చోటు నుండి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. స్నేహితులను కలుసుకుంటారు

వృషభరాశి: మీ కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు!

మీ కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. మీరంటే గిట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది. బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మిధునరాశి: వాయిదా పడ్డ పనులను పూర్తి చేస్తారు!

ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.ఇంటికి సంబంధించిన నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

కర్కాటక రాశి: మీరు ప్రారంభించే పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు!

మీరు ప్రారంభించే పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. భూమికి సంబంధించిన విషయాలు మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

సింహరాశి: ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి!

ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి. ప్రారంభించిన పనులను వాయిదా వేయడమే మంచిది. అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది. ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

కన్యరాశి: పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి!

పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకొని వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

తులరాశి: మీరు చేసే పనుల్లో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు!

మీరు చేసే పనుల్లో కొన్ని మార్పుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వలన విశ్రాంతి దొరకదు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. బయట అప్పుగా ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా తిరిగి సమయానికి చేతికి అందుతుంది.

వృశ్చికరాశి: అనవసరంగా మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.

అనవసరంగా మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. ఇతరుల నుండి మీ సొమ్ము సమయానికి చేతి అందుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. మీరే పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తవుతుంది.

ధనుస్సురాశి: ఇతరుల మాటలు మీ మనసును నొప్పిస్తాయి!

ఇతరుల మాటలు మీ మనసును నొప్పిస్తాయి. ప్రారంభించిన పనులను చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారు ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి. కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది.

మకరరాశి: ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అందుతాయి!

ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది. బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

కుంభరాశి: మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు!

మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంత అనుకూలంగా ఉంది. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. పెద్దవారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

మీనరాశి: ప్రారంభించే పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు!

ప్రారంభించే పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. కొన్ని ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది. ఇతరుల మాటలు మీ మనసును నొప్పిస్తాయి. మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. దూర ప్రయాణాలను వాయిదా వేయాలి.