Today Horoscope: నవంబర్ 18వ తేదీ శుక్రవారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: విద్యార్థులు మంచి విజయాలను సాధిస్తారు!

కొన్ని దూరపు ప్రయాణాలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది. విద్యార్థులు
ఈరోజు మంచి విజయాలను సాధిస్తారు. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు. మీ మాటలతో ఇతరుల మనసుని ఆకట్టుకుంటారు. ధైర్యంతో ముందుకు వెళ్తా అంతా మంచే జరుగుతుంది.

వృషభరాశి: అపార్ధాలు చేసుకుంటారు!

ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే మాటలను అపార్ధాలు చేసుకుంటారు. ఇతరుల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోకండి. కొన్ని కారణాల వలన ఈరోజు మీ స్నేహితులకు దూరంగా ఉండవలసి వస్తుంది. మరోవైపు భూమికి సంబంధించిన విషయాలలో ఈరోజు మీరు వాదనాలకు దిగకపోవడం మంచిది.

మిధునరాశి: ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు!

కొన్ని దూరపు ప్రయాణాలు ఈరోజు మీరు వాయిదా వేసుకోవడం మంచిది. మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు ఈరోజు మీకు పనికిరావు. ఏ పని ప్రారంభించిన. ఇతరుల సహాయం మీకు అందుతుంది. కుటుంబ సభ్యులతో కొంత సమయాన్ని గడుపుతారు.

కర్కాటక రాశి: తోబుట్టుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు.

తోబుట్టువుల వాదనలో ఈరోజు మీరు జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. వ్యాపారస్తులు
ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. తోటి వారి సహాయంతో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

సింహరాశి: తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు!

ఈరోజు తొందరపడి మీరు ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. ఈరోజు కొన్ని సందర్భాల్లో ఒత్తిడితో కూడిన పరిస్థితులు ఎదుర్కోవచ్చు. అనవసరంగా ఎదుటి వారి విషయాల్లో ఈరోజు మీరు జోక్యం చేసుకోకండి. శ్రమతో కూడిన పనుల్లో ఈరోజు మీరు ఇబ్బంది పడతారు. కొన్ని దూరపు ప్రయాణాలు ఈరోజు మీరు వాయిదా వేసుకోవడం మంచిది.

కన్యరాశి: ఈరోజు సమయం అనుకూలంగా ఉంది!

ఈరోజు ప్రారంభించిన పనుల్లో సమయం అనుకూలంగా ఉంది. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. దూర ప్రాంతాల నుండి ఈరోజు మీరు శుభవార్త వింటారు. ఆ శుభవార్త మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

తులరాశి: ఒత్తిడితోకూడిన సమస్యలను ఎదుర్కొంటారు!

ఈరోజు బయట ఒత్తిడితో కూడిన సమస్యలను ఎదుర్కొంటారు. అనవసరంగా ఇతరులతో ఈరోజు మీరు వాదనలకు దిగకపోవడమే మంచిది. ఇతరుల ప్రవర్తన మీ మనసులకు ఎంతో బాధని కలిగిస్తుంది. బయట కొన్ని కొత్త పరిచయాలు ఈరోజు మీకు ఏర్పడతాయి. ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకపోవడం మంచిది.

వృశ్చికరాశి: పనుల్లో హడావిడి ఉంటుంది!

ప్రారంభించిన పనుల్లో హడావిడి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతానికి ఇప్పటికి ఉన్న భూమి సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది. కొందరు ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.

ధనుస్సురాశి: అ జాగ్రత్త మీలో ఎక్కువగా ఉంటుంది!

ఈరోజు చేసే పనుల్లో అ జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది. ఇతరుల మాటలు ఈరోజు మీ మనసుకు ఎంతో బాధని కలిగిస్తాయి. వాతావరణం లో కొన్ని మార్పుల వలన మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. కొన్ని దూరపు ప్రయాణాలు ఈరోజు మీరు చేయకపోవడమే మంచిది.

మకరరాశి: పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి!

ఈరోజు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు. పరిస్థితులు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటాయి. స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు. సమయానికి అనుకోని చోటు నుండి డబ్బు చేతికి అందుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

కుంభరాశి: వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది!

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు. మీరు చేసే వ్యాపారంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు. సమాజంలో మంచి పలుకుబడి పెరుగుతుంది. చాలా సంతోషంగా ఉంటారు.

మీనరాశి: విద్యార్థులు విద్యపై పూర్తి దృష్టి పెట్టాలి!

బయట వ్యక్తుల తగాదాల్లో ఈరోజు మీరు తల దూర్చకుండా ఉండడమే మంచిది. విద్యార్థులు విద్యపై పూర్తి దృష్టి పెట్టాలి. తరచూ మార్చుకునే మీ నిర్ణయాలా వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యా అవకాశం ఉంది. మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.