మేషరాశి: మానసిక ఆందోళనలను తొలగిపోతాయి!
గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందుతారు. ఈరోజు తో మానసిక ఆందోళన తొలగిపోతుంది. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ మాటలతో ఇతరుల మనసుని ఆకట్టుకుంటారు. చాలా సంతోషంగా ఉంటారు.
వృషభరాశి: కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది!
ఇరుగు పొరుగు వారితో ఈరోజు మీరు వాదనలకు దిగుతారు. ఈరోజు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే మంచిది. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఈ రోజు ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు. కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు చేయాలి.
మిధునరాశి: నూతన వస్తువులు ఆభరణాలు ఖరీదు చేస్తారు.
అనుకోని విధంగా ఈరోజు మీకు డబ్బు చేతికి అందుతుంది. కొన్ని బంగారు ఆభరణాలు నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నాలు చేస్తారు.
కర్కాటక రాశి: వృధా ప్రయాణాలు ఎక్కువ అవుతాయి!
మిత్రులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు. వృధా ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే మంచిది. అనవసరంగా మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి. ప్రారంభించిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.
సింహరాశి: స్నేహితుల వలన సమస్యలు ఎదుర్కొంటారు!
ఇతరులతో వి వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది. బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
కన్యరాశి: చేస్తే ఉద్యోగంలో అదృతమైన విజయాలు సాధిస్తారు!
కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు. మీరు చేసే ఉద్యోగంలో అద్భుతమైన విజయాన్ని పొందుతారు. ఇంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు. ఇతరుల విషయాలలో మీరు జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. ధైర్యంతో ముందుకు వెళ్లాలి.
తులరాశి: ప్రారంభించిన పనులు చాలా ఆలస్యంగా పూర్తవుతాయి!
మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ప్రారంభించిన పనులు చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు. అనవసరంగా ఇతరుల వారిపై ఉన్న కోపం పిల్లలపై చూపిస్తారు. కుటుంబంలో తరచు మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
వృశ్చికరాశి: పోట్లాటలకు దూరంగా ఉండాలి!
భూమికి సంబంధించిన విషయాలలో ఈరోజు పోట్లాటలకు దూరంగా ఉండటం మంచిది. ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు. పిల్లల భవిష్యత్తు గురించి ఈరోజు మీరు ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. విద్యార్థులు ఈ రోజు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.
ధనుస్సురాశి: శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది!
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. శత్రువుల పట్ల ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విందు వినోదల కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి
మకరరాశి: పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు!
ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ పట్టుదలతో పూర్తి చేస్తారు. కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచనలు అవసరం. కొన్ని వర్గ సంబంధిత విభేదాలు ఈరోజు జరిగే అవకాశం ఉంది. అనవసరమైన ఆందోళనతో సతమతమవుతారు.
కుంభరాశి: ఉద్యోగంలో మీ మాట విలువ పెరుగుతుంది!
ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు. మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు చేసే ఉద్యోగంలో మాట విలువ పెరుగుతుంది. సంతానపరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి: ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి!
ప్రారంభించిన పనులు ఈరోజు వాయిదా వేసుకోవడమే మంచిది. ఇతర వాటిపై కాకుండా ఈరోజు మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి. కొన్ని విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది. ఇరుకు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది. అనవసరంగా ఇతరుల విషయాలు జోక్యం చేసుకోకండి.