Today Horoscope: డిసెంబర్ 31వ తేదీ శనివారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి!

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు. కొన్ని దూర ప్రాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది. ఇతరుల మాటలు మీ మనసుని నొప్పిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది. కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.

వృషభరాశి: నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు!

నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దేవదర్శనాల వంటి ప్రయాణాలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

మిధునరాశి: ఎప్పటి నుండో వాయిదా పడ్డ పనులను పూర్తి చేస్తారు!

ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులను స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు. కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనులంగా ఉంది. గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది. స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

కర్కాటక రాశి: ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి!

ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి. కొన్ని దూర ప్రయాణాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి. భూమికి సంబంధించిన విషయాల్లో మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన సమస్యలను ఎదుర్కొంటారు. మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

సింహరాశి: ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి!

ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనలతో సతమతమవుతారు. కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయడమే మంచిది. అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు. వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. ఇతరుల సహాయంతో కొన్ని పనులను పూర్తి చేస్తారు. బయట నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

కన్యరాశి: నూతన వాహనం కొనుగోలు చేస్తారు!

నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహపరిస్తాయి.వృత్తి వ్యవహారాల్లో కీలక నిర్ణయాల అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు రావలసిన పదోన్నతులు పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఇతరుల నుండి రావాల్సిన సొమ్ము సమయానికి చేతికందుతుంది.

తులరాశి: ఉద్యోగాలు అనుకూల వాతావరణం ఉంటుంది!

ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనుల్లో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. అప్పుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల సలహాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. మీ స్నేహితులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు. మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది.

వృశ్చికరాశి: వ్యాపార ఉద్యోగాలు ఊహించని మార్పులు ఉంటాయి!

వ్యాపార ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. సోదరులు కొన్ని విషయాల్లో మీతో విభేదిస్తారు. ఆరోగ్య విషయాల్లో వహించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

ధనుస్సురాశి: కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు తీరతాయి!

కుటుంబ సభ్యులతో కొన్ని వివదాలు తీరతాయి. సన్నిహితులతో సక్కతగా వ్యవహరిస్తారు. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. నూతన భూ కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

మకరరాశి: మిత్రులతో స్వల్ప విభేదాలు ఉంటాయి!

మిత్రులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. చేపట్టిన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాల్లో నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయాలు జాగ్రత్త అవసరం. ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు కొంత ఒత్తిడి కలిగిస్తాయి. వృత్తి వ్యాపారంలో శ్రమ తప్ప ఫలితాలు కనిపించవు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. శత్రువులకు దూరంగా ఉండడమే మంచిది.

కుంభరాశి: కుటుంబ సభ్యులతో ఆలయాలు సంప్రదిస్తారు!

కుటుంబ సభ్యులతో ఆలయాలు సంప్రదిస్తారు. ఇంటా బయట పరిస్థితిలో అనుకూలించవు. గృహమున కొందరి ప్రవర్తన శిరో బాధలు కలిగిస్తాయి. వ్యాపార ఉద్యోగాల్లో చికాకులు తప్పవు. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. భూమికి సంబంధించిన విషయాలలో మీరు తలదూర్చకుండా ఉండడమే మంచిది.

మీనరాశి: ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి!

ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.