Today Horoscope: డిసెంబర్ 25వ తేదీ ఆదివారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: ముఖ్యమైన పనులు అనుకూలిస్తాయి!

ముఖ్యమైన పనులు అనుకూలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు. మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడం మంచిది. తరచు మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వృషభరాశి: కొన్ని వ్యవహారాల్లో మిత్రుల నుంచి ధన సహాయం అందుతుంది!

కొన్ని వ్యవహారాల్లో మిత్రుల నుండి ధన సహాయం అందుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది.

మిధునరాశి: స్నేహితుల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు!

స్నేహితుల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది. అనుకోని చోటు నుండి ఆహ్వానాలు అందుతాయి. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తలదూర్చడానికి ప్రయత్నిస్తారు. తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

కర్కాటక రాశి: ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది!

ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపార ఉద్యోగాల్లో మరింత పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. వాహనం కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. అనుకోని చోటు నుండి డబ్బు చేతికి అందుతుంది. అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు. వారితో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొంతవరకు మంచే జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంటారు.

సింహరాశి: మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి!

మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. రుణ ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సంప్రదిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. కొందరి ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

కన్యరాశి: ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది!

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బంధువులతో స్వల్ప విభేదాలు తప్పవు. వ్యాపారాల్లో ఉద్యోగాల్లో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలున్నవి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. భూమికి సంబంధించిన విషయాల్లో మీరు తలదూర్చకుండా ఉండడమే మంచిది. మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

తులరాశి: వ్యాపారాలు విస్తరిస్తాయి!

వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. దూరపు స్నేహితుల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది. ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

వృశ్చికరాశి: వ్యాపార ఉద్యోగాల్లో నిరుత్సాహం తప్పదు!

వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహం తప్పదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. బంధుమిత్రులతో ఆకారణంగా వివాదాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ధనుస్సురాశి: కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది!

కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆకస్మిక ధన వస్తు లాబాలను పొందుతారు. ఉద్యోగాలు అనుకున్న మార్పులు ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనుకోని చోటు నుండి ఆహ్వానాలు అందుతాయి.

మకరరాశి: చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాల ఉంటాయి!

చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలు తప్పవు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలు ఆకస్మిక మార్పులు చేస్తారు. స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.

కుంభరాశి: చేపట్టిన వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతారు!

చేపట్టిన వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాల్లో మరింత అనుకూలంగా సాగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి.

మీనరాశి: విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు!

విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది. నిరుద్యోగులకు ఆప్రయత్నంగా అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. స్నేహితుల సహాయ సహకారాలతో నూతన వ్యవహారాలు ప్రారంభిస్తారు. స్నేహితుల సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చలు చేస్తారు.