Today Horoscope: డిసెంబర్ 19వ తేదీ సోమవారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు!

అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పురోగతి సాధిస్తారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొన్ని దూర ప్రయాణాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోకండి.

వృషభరాశి: చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.

చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.
గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో నూతన పదవులు పొందుతారు. సంతారానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో పెట్టుబడి విషయంలో మీకు సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

మిధునరాశి: ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి!

ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఉంటాయి. నూతన రుణ యత్నాలు కలిసి రావు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. తరచు మీ నిర్ణయాలు మార్చుకోవడం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు. కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.

కర్కాటక రాశి: ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి!

ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభ సాటిగా సాగుతాయి. ఉద్యోగాల వివాదాలు పరిష్కారం అవుతాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అకస్మిక ధన వస్తు లాభాలను పొందుతారు. కొన్ని దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.

సింహరాశి: వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి!

వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాల అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువులతో సంబంధం బాంధవ్యాలు మెరుగుపడతాయి. మీ చిన్ననాటి స్నేహితుల నుండి ఆహ్వానాలు అందుతాయి. దూరప్రాణాలు చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

కన్యరాశి: దూర ప్రయాణాలు వాయిదా పడతాయి!

దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది. మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది. తరచు మీరు నిర్ణయాలు మార్చుకోవడం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. బయట ఉహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

తులరాశి: ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది!

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో వివాదాలు సర్దు మనుగుతాయి. కుటుంబ సభ్యులతో దర్శనాలు చేసుకుంటారు. కొన్ని వ్యవహారాలు అప్పుల సలహాలు పాటిస్తారు. భూమికి సంబంధించిన విషయాలలో మీరు జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిది. ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి.

వృశ్చికరాశి: ఆలయాల దర్శనం చేస్తారు!

ఆలయాలు దర్శనం అందుకుంటారు. వ్యాపారాలు స్వల్పంగా లభిస్తాయి. ఉద్యోగాల్లో సమస్యలు తొలుగుతాయి. చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నవి. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది. తరచూ మీ నిర్ణయాలను మార్చుకోవడం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సురాశి: నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి!

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వాహన కొనుగోలు చేస్తారు. పనులు చకచకాసాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అందుతాయి. మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. వ్యాపారమున బాగా భాగస్తుల ప్రవర్తన ఆశ్చర్య పరుస్తుంది. అనుకోని చోటు నుండి ఆహ్వానాలు అందుతాయి. భవిష్యత్తులో పెట్టుబడునుండి మంచి లాభాలను అందుకుంటారు.

మకరరాశి: సంఘంలో పలుకుబడి పెరుగుతుంది!

సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాల్లో అధికారులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. విలువైన వస్త్ర వస్తులాభాలను పొందుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంత అనుకూలంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల్లో అంతా మంచే జరుగుతుంది.

కుంభరాశి: దూర ప్రయాణ సూచనలున్నవి!

దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. సన్నిహితులతో విభేదాలు చికాకు పరుస్తాయి. కుటుంబంలో కొందరి మాటలు మానసికంగా బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. కొన్ని దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనాలు చేసుకుంటారు.

మీనరాశి: కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది!

కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆర్థికపరంగా సమస్యలు తప్పవు. వ్యాపార ఉద్యోగాలు అంతంతమాత్రంగా సాగుతాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దైవచింతన కలుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. దూరపు బంధువుల నుండి శుభవార్తలు వింటారు. అవి మీ మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి.